E-Paper
Advertisement

Union Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. వొడాఫోన్‌-ఐడియాకు బిగ్ రిలీఫ్

Union Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. వొడాఫోన్‌-ఐడియాకు బిగ్ రిలీఫ్
Advertisement

Union Cabinet Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కీలక సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార ప్రసార, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, టెలికాం రంగం భవితవ్యంపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలోని ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ.. వోడాఫోన్–ఐడియాకు ఊరట కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకుంది. వోడాఫోన్–ఐడియాపై ఉన్న ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిల విషయంలో కేంద్రం కీలక వెసులుబాటు కల్పించింది. కంపెనీ చెల్లించాల్సిన రూ.87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలను ఫ్రీజ్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం బకాయిలను 2023 నుంచి 2041 మధ్య కాలంలో దశలవారీగా చెల్లించేలా అనుమతి ఇచ్చింది.

Advertisement

టెలికాం రంగంలో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వోడాఫోన్–ఐడియా సంస్థ దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులకు సేవలందిస్తున్న నేపథ్యంలో, సంస్థ కొనసాగింపుకు ఇది కీలకంగా మారనుంది. టెలికాం రంగంలో పోటీని నిలబెట్టేందుకు, ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలతో పాటు ప్రైవేటు రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా నిలిచింది.

అదే సమయంలో, దేశ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కూడా ..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ.20,668 కోట్ల వ్యయంతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశంలో రహదారి అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

Advertisement

ప్రధానంగా నాసిక్–షోలాపూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి షోలాపూర్ వరకు ఈ రహదారి కారిడార్ అభివృద్ధి చెందనుండగా, భవిష్యత్తులో దీనిని కర్నూలు, కడప మీదుగా చెన్నై వరకు విస్తరించే యోచనను కేంద్రం ప్రకటించింది. ఈ విస్తరణతో పశ్చిమ భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి రవాణా మరింత సులభం కానుంది.

Also Read: శత్రువుతో చేతులు కలిపిన ఝాన్సీ రెడ్డి? ఎర్రబెల్లితో ‘చీకటి ఒప్పందం’ బట్టబయలు!

ఈ రహదారి ప్రాజెక్టుల వల్ల పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్య రంగాలకు ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రయాణ సమయం తగ్గడం, ఇంధన వినియోగం తగ్గడం, రవాణా ఖర్చులు తగ్గడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయి.

 

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×