Hyundai AC Check Up Camp 2026: వేసవి మొదలైంది. ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు దేశవ్యాప్తంగా ఏసీ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాంప్ ద్వారా వాహనాల్లోని ఏసీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ క్యాంప్ లో భాగంగా హ్యుందాయ్ వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా ఫ్రీ 30 పాయింట్స్ పేరుతో వెహికల్స్ చెక్ చేయనుంది. డ్రై వాష్ సర్వీసును కూడా ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తుంది. వేసవిలో కార్ క్యాబిన్ చల్లగా ఉండేందుకు ఏసీ సిస్టమ్ సరిగా పనిచేయడం ఎంతో అవసరం. అందుకే, కంపెనీ ఏసీ సర్వీసింగ్ పై ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.
ఏసీ గ్యాస్ రీఫిల్, సర్వీసింగ్ లాంటి సర్వీసులకు సుమారు 15 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. అలాగే, వీల్ అలైన్ మెంట్, బ్యాలెన్సింగ్ సేవలపై కూడా ఇదే స్థాయిలో డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాంప్రెసర్, కండెన్సర్, కూలింగ్ కాయిల్ లాంటి ముఖ్యమైన ఏసీ భాగాలపై సుమారు 10 శాతం వరకు ధర తగ్గింపు అందిస్తుంది. అదనంగా ఏసీ డిసిన్ఫెక్టెంట్ ట్రీట్‌మెంట్, ప్లాస్టిక్ భాగాల రిస్టోరేషన్ లాంటి సర్వీసులు కూడా తగ్గింపు ధరలతో అందిస్తుంది.
ఈ ఏసీ చెకింగ్ క్యాంప్ దేశ వ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ అధికారిక సర్వీస్ సెంటర్లలో నిర్వహించబడుతుంది. దీంతో వినియోగదారులు ఈ సేవలను సులభంగా పొందవచ్చు. శిక్షణ పొందిన టెక్నీషియన్లు వాహనాన్ని పూర్తిగా పరిశీలించి, అవసరమైన మార్పులు సూచిస్తారు. ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉపయోగించడం వల్ల వాహనం పనితీరు మెరుగుపడుతుంది.
వినియోగదారులకు ఎలాంటి మున్ముందు సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా, వేసవిలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. ముందుగానే వెహికల్ చెక్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించే అవకాశం ఉందన్నారు. ఈ ఏసీ చెకప్ క్యాంప్ వాహనదారులకు మంచి అవకాశం కానుంది. తక్కువ ఖర్చుతో అవసరమైన సేవలు పొందడంతో పాటు, కారు పనితీరు మెరుగుపరచుకోవచ్చు. చిన్నపాటి తనిఖీలు పెద్ద మరమ్మత్తుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
Read Also: భారత్‌లో టెస్లా సేల్స్ షాక్.. జస్ట్ 342 కార్ల అమ్మకం!