E-Paper
Advertisement

Tesla Sales: భారత్‌లో టెస్లా సేల్స్ షాక్.. జస్ట్ 342 కార్ల అమ్మకం!

Tesla Sales: భారత్‌లో టెస్లా సేల్స్ షాక్.. జస్ట్ 342 కార్ల అమ్మకం!
Advertisement

Tesla Sales in India 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ ఆటో దిగ్గజం టెస్లా దేశీ మార్కెట్ లో సత్తా చాటలేకపోతోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కంపెనీ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచింది. టెస్లా దేశంలో మొత్తం కేవలం 342 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అమ్మింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్  విడుదల ఈ గణాంకాలు ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

జూలైలో తొలి టెస్లా షో రూమ్ ప్రారంభం

టెస్లా భారత మార్కెట్లోకి జూలైలో అడుగు పెట్టింది. ముంబైలో మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ దేశంలో ఒకే ఒక మోడల్‌ ను అందిస్తోంది. అదే మోడల్ Y ఎలక్ట్రిక్ SUV. ఇది పూర్తిగా విదేశాల్లో తయారై భారతదేశానికి దిగుమతి అవుతున్న వాహనం. అందువల్ల ధర కూడా ఇతర మార్కెట్లతో పోలిస్తే ఎక్కువగా ఉంది.

Advertisement

ఇక భారత్ లో మొత్తం EV మార్కెట్‌ను పరిశీలిస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.99 లక్షల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోల్చితే భారీగా పెరిగాయి. అయితే, మొత్తం కార్ల మార్కెట్‌లో EVల వాటా కేవలం 4.25 శాతం మాత్రమే. అంటే, ఇంకా ఈ రంగం అభివృద్ధి దశలోనే ఉందని చెప్పుకోవచ్చు.

ముందంజలో దేశీ కంపెనీలు

ఈవీ రంగంలో దేశీయ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, ఎంజీ మోటార్ ఇండియా, మహీంద్రా లాంటి సంస్థలు తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తూ మార్కెట్‌ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. లగ్జరీ సెగ్మెంట్‌లో BMW, మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి బ్రాండ్లు కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. టెస్లా మోడల్ Y విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్, లాంగ్ రేంజ్ మోడళ్లు. వీటి ధరలు సుమారు రూ. 59.89 లక్షల నుంచి రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి. అధిక దిగుమతి సుంకాల కారణంగా ఈ ధరలు మరింత పెరిగాయి.  దేశంలో దిగుమతి వాహనాలపై 70% నుంచి 100% వరకు సుంకాలు విధించడంతో టెస్లా కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఫర్మార్పెన్స్ లో సత్తా చాటినా..

Advertisement

పర్ఫార్మెన్స్ విషయంలో మోడల్ Y మంచి ఫీచర్లను అందిస్తోంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. వేగం విషయంలో చాలా ముందంజలో ఉంది. జస్ట్ 3.5 సెకెన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంఉండటంతో తక్కువ సమయంలోనే మంచి రేంజ్ పొందవచ్చు. ఇండియాలో టెస్లా ప్రస్తుతం గురుగ్రామ్, ముంబై, న్యూఢిల్లీలో ఎక్స్‌ పీరియన్స్ సెంటర్లను నిర్వహిస్తోంది. కొద్ది సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఈ నెట్‌ వర్క్‌ను  విస్తరించాలని భావిస్తోంది.   టెస్లా భారత మార్కెట్లో తన స్థానం కోసం ప్రయత్నిస్తోంది. కానీ, అధిక ధరలు, పరిమిత మోడళ్ల లాంటి అంశాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.

Read Also: కేశవా ఏందిరా ఇదీ… ఈ కారు ఏకంగా 406 టన్నుల రైలును లాగేసిందీ!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×