E-Paper
Advertisement

హ్యుందాయ్ షాక్.. అన్ని కార్లపై ధరల పెంపు!

హ్యుందాయ్ షాక్.. అన్ని కార్లపై ధరల పెంపు!
Advertisement

Hyundai Announces Price Hike: ఆటో మోబైల్ దిగ్గజం హ్యుందాయ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తమ బ్రాండ్ కు సంబంధించిన అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.  సుమారు 1 శాతం వరకు ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ లో వెల్లడించింది. అయితే, ప్రతి మోడల్‌కు ఎంత మేర పెంపు ఉంటుందో స్పష్టంగా చెప్పలేదు. వేరియంట్, మోడల్‌ ను బట్టి ధరల పెరుగుదల మారుతుందని తెలిపింది.

రూ. 5 వేల నుంచి రూ. 4.6 లక్షల వరకు పెంపు

ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ సవరణతో కార్ల ధరలు సుమారు రూ. 5,500 నుంచి రూ. 4.63 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో కొంత భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వచ్చిందని సంస్థ వివరించింది. అయితే, 2026లో హ్యుందాయ్ రెండోసారి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కంపెనీ 0.6 శాతం మేర ధరలను పెంచింది. అంతేకాకుండా, మార్చిలో వెన్యూ మోడల్ ధరను సుమారు రూ. 20,000 వరకు పెంచింది. ఇప్పుడు మేలో మరోసారి ధరలు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కార్ల ప్రస్తుత ధరలు

Advertisement

హ్యుందాయ్ కార్ల ప్రస్తుత ధరలను పరిశీలిస్తే, ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ. 5.55 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఆరా ధరలు రూ. 6 లక్షల నుంచి ఉంటాయి. ఐ20 మోడల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 11.53 లక్షల వరకు ఉన్నాయి. ఎక్స్టర్ ధరలు రూ. 5.80 లక్షల నుంచి రూ. 9.42 లక్షల వరకు ఉన్నాయి. అలాగే, వెన్యూ మోడల్ ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.40 లక్షల వరకు ఉన్నాయి. క్రెటా ధరలు రూ. 10.79 లక్షల నుంచి రూ. 20.20 లక్షల వరకు ఉంటాయి. వెర్నా ధరలు రూ. 10.98 లక్షల నుంచి రూ. 18.25 లక్షల వరకు ఉన్నాయి. అల్కాజర్ ధరలు రూ. 14.50 లక్షల నుంచి రూ. 21.06 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ విభాగంలో, క్రెటా ఎలక్ట్రిక్ ధరలు రూ. 18.02 లక్షల నుంచి రూ. 24.40 లక్షల వరకు ఉన్నాయి. ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్ అయోనిక్ 5 ధర రూ. 46.30 లక్షలుగా ఉంది.

పెరగనున్న కార్ల ధరలు

ఈ తాజా ధరల పెంపుతో, అన్ని మోడళ్ల ధరలు కొద్దిగా పెరగనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు నిర్ణయంపై మరోసారి ఆలోచించే పరిస్థితి రావచ్చు. అయితే, మార్కెట్ పరిస్థితులు, ముడిసరుకు ఖర్చుల దృష్ట్యా కంపెనీకి ఇది తప్పనిసరి నిర్ణయంగా కనిపిస్తోంది. మొత్తంగా మే 2026 నుంచి హ్యుందాయ్ కార్లు కాస్త ఖరీదు కానున్నాయి. కారు కొనాలని భావిస్తున్నవారు ముందే కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Read Also: కారులోనే హోం థియేటర్, కళ్లు చెదిరే ఇంటీరియర్.. వారెవ్వా ఏముంది భయ్యా!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×