E-Paper
Advertisement

క్రెటా To ఐయోనిక్ 5.. హ్యుండాయ్ నుంచి రాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

క్రెటా To ఐయోనిక్ 5.. హ్యుండాయ్ నుంచి రాబోతున్న క్రేజీ కార్లు ఇవే!
Advertisement

New Hyundai Launches in India: ప్రముఖ ఆటో మోబైల్ కంపెనీ హ్యుండాయ్ మోటార్ సంస్థ భారత మార్కెట్‌ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తోంది. ప్రస్తుతం అమ్మకాల పరంగా నాలుగో స్థానంలోకి వెళ్లిన ఈ సంస్థ, మళ్లీ టాప్ స్థానాలకు చేరుకోవడానికి ఒకేసారి నాలుగు కొత్త కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ న్యూ జెనరేషన్ క్రెటా   

తొలుత న్యూజెనరేషన్ హ్యుండాయ్ క్రెటా మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌ లో టాప్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ మోడల్ కొత్త వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పరిమాణంలో పెద్దదిగా ఉండటంతో పాటు మరింత బలంగా, సేఫ్ గా మారనుంది. డిజైన్‌ లో ఐయోనిక్ 5 స్టైల్ ప్రభావం కనిపిస్తుంది. పిక్సెల్ స్టైల్ LED లైట్లు, కొత్త గ్రిల్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ లాంటి మార్పులు ఉంటాయి. లోపల పెద్ద స్క్రీన్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, ADAS లాంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

⦿ కొత్త కాంపాక్ట్ SUV

Advertisement

అటు బేయాన్ ఆధారంగా ఒక కొత్త కాంపాక్ట్ SUV రూపొందిస్తున్నారు. ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. 2026 చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. బాక్సీ డిజైన్, స్ప్లిట్ హెడ్‌ ల్యాంప్స్, పెద్ద గ్రిల్‌ తో బలమైన లుక్ ఉంటుంది. లోపల పెద్ద టచ్‌ స్క్రీన్, 360 కెమెరా, కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉంటాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు అందిస్తాయి.

⦿ చౌకైన ఎలక్ట్రిక్ SUV

హ్యుందాయ్ ఓ చౌకైన ఎలక్ట్రిక్ SUVను కూడా తీసుకురానుంది. ఇది హ్యుండాయ్ ఇన్ స్టర్ EV ఆధారంగా ఉంటుంది. 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతోంది. ఒకే ఛార్జ్ తో సుమారు 300 నుంచి 350 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ EV టాటా పంచ్.ev వంటి కార్లకు పోటీగా ఉంటుంది. లోపల డిజిటల్ డిస్‌ ప్లే, టచ్‌ స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి.

⦿ హ్యుందాయ్ ఐయోనిక్ 5

Advertisement

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ గా విడుదల కానుంది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఈ ఏడాది సెకెండాఫ్ లో  విడుదలయ్యే అవకాశం ఉంది. డిజైన్‌ లో చిన్న మార్పులు ఉంటాయి. లోపల కొత్త స్టీరింగ్ వీల్, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి అప్‌ డేట్లు ఉంటాయి. కొత్త 84 kWh బ్యాటరీ ఇవ్వడం వల్ల రేంజ్ సుమారు 570 కి.మీ వరకు పెరుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో కేవలం 18 నిమిషాల్లో 10-80% ఛార్జ్ అవుతుంది.

Read Also: స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్.. వోక్స్‌ వ్యాగన్ టైగన్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×