E-Paper
Advertisement

అండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు

అండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు
Advertisement

Andaman Sea: అండమాన్ సముద్రంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం, సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవాలనే ఆశతో పడవలో ప్రయాణమైన సుమారు 250 మంది ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపాల్లా మారాయి. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుండి బయలుదేరిన ఈ పడవ, మలేసియా చేరుకోవాలనే లక్ష్యంతో సముద్రంలో ప్రయాణిస్తుండగా ప్రకృతి ప్రకోపానికి గురైంది.

ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా గాలుల వేగం పెరగడం, సముద్రపు కెరటాలు ఉద్ధృతంగా ఎగసిపడటంతో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. పడవలో ఉన్నవారిలో ఎక్కువ మంది రోహింగ్యా శరణార్థులు , బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సముద్రపు స్థితిగతులు రక్షణ బృందాలకు సవాలుగా మారాయి. తీరని వేదన మిగిల్చిన ఈ ఘటన, ప్రాణాలను పణంగా పెట్టి సాగించే ప్రమాదకర వలసల వెనుక ఉన్న సామాజిక బాధలను మరోసారి కళ్లకు కట్టింది.

Advertisement

Also Read: ఒక్క ఫోన్ సిగ్నల్.. 200 మంది ప్రాణాలు.. విమానంలో ఫ్లైట్ మోడ్ ఎందుకు కంపల్సరీ?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×