E-Paper
Advertisement

వైసీపీ నేతలకు కష్టాలు.. జగన్ మాజీ సీపీఆర్వో, ఆ పార్టీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి అరెస్ట్

వైసీపీ నేతలకు కష్టాలు..  జగన్ మాజీ సీపీఆర్వో, ఆ పార్టీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి అరెస్ట్
Advertisement

Amaravati: ఏపీలో వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఒకరి తర్వాత మరొకరు అరెస్టు అవుతున్నారు. తాజాగా జగన్ మాజీ సీపీఆర్వీ, వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబును కించపరుస్తూ సోషల్‌మీడియాలో యానిమేషన్ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

వైసీపీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి అరెస్ట్

Advertisement

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్లో వాటిపై చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో రంగంలో దిగారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా ఆ తరహా పోస్టులు పెట్టినవారిపై కొరడా ఝులిపించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో సీపీఆర్వోగా పని చేశారు పూడి శ్రీహరి.

చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి యానిమేషన్ పోస్టింగ్‌లు చేసినట్టు చిత్తూరులో ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. బుధవారం ఉదయం శ్రీహరిని విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి సెల్‌ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Advertisement

చంద్రబాబుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు

వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత కీలకమైన వ్యక్తుల్లో శ్రీహరి కూడా ఒకరు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీహరి అరెస్టుతో ఒక్కసారి ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఏమైనా విషయాల్లో శ్రీహరి సలహాను తప్పకుండా జగన్ పాటించిన సందర్భాలు ఉంటాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

ఆయన పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.  సోషల్ మీడియాలో పోస్టింగుల వ్యవహారంలో ఇంకా వైసీపీకి చెందిన డజను మంది నేతలు కీలకంగా ఉన్నారన్నది అధికార పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నమాట. రేపో మాపో వారిని కూడా అరెస్ట్ చేయడం ఖాయమనే వాదన అమరావతిలో బలంగా వినిపిస్తోంది.

ALSO READ: ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026: బాలికలదే పైచేయి, ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత

 

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×