E-Paper
Advertisement

హ్యుందాయ్ నుంచి బడ్జెట్ ఈవీ SUV.. టాటా పంచ్ ఈవీకి చుక్కలేనా?

హ్యుందాయ్ నుంచి బడ్జెట్ ఈవీ SUV.. టాటా పంచ్ ఈవీకి చుక్కలేనా?
Advertisement

New Hyundai Budget EV  SUV: హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ SUVని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. 2027లో విడుదల కానున్న ఈ మోడల్ పూర్తిగా భారత్ లోనే డిజైన్ చేసి, తయారు చేయనున్నారు. ప్రస్తుతం HE1i కోడ్‌ నేమ్‌ తో డెవలప్ అవుతున్న ఈ కాంపాక్ట్ EV, టాటా పంచ్ EV లాంటి మోడళ్లకు  గట్టి పోటీ ఇవ్వబోతోంది. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ ప్లాంట్‌ లో దీనిని తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

భారత మార్కెట్ కు సరిపోయేలా ప్రత్యేక మార్పులు

ఈ కొత్త మోడల్ కు సంబంధించి పెద్దగా వివరాలు తెలియకపోయినా, హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV  లేదంటే కియా EV2 ఆధారంగా రూపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, భారత మార్కెట్‌ కు సరిపోయేలా దీనిలో కొన్ని ప్రత్యేక మార్పులు చేయబడే అవకాశముంది. 2027 నాటికి టాటా, మహీంద్రా, రెనాల్ట్  లాంటి కంపెనీలు కూడా ఇలాంటి కాంపాక్ట్ EV SUVలను తీసుకురావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, పోటీ మరింత పెరగనుంది.

డిజైన్ గురించి..

Advertisement

ఈ కొత్త మోడల్ డిజైన్ విషయానికి వస్తే, బయటకు వచ్చిన స్పై ఫోటోలు ఈ కారు బాక్సీ స్టైల్‌ తో ఉంటుందని సూచిస్తున్నాయి. మంచి లుక్, పెద్ద వీల్ ఆర్చ్‌ లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇవన్నీ కలిపి SUVకి మస్కులర్, మోడ్రన్ లుక్ ఇస్తాయి. పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ ఫారమ్‌ పై ఈ కారు  నిర్మించబడుతుందని భావిస్తున్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో..

ఇంటీరియర్ గురించి పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయినప్పటికీ, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ కారు వస్తుందని తెలుస్తోంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశముందని స్పై షాట్స్  వెల్లడిస్తున్నాయి.

బ్యాటరీ, రేంజ్ గురించి..

Advertisement

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. కానీ, స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్‌లు అందుబాటులో ఉండవచ్చని అంచనా. ఇది సిటీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌తో పాటు, రోజువారీ వినియోగానికి అనువుగా ఉండేలా రూపొందించబడుతుంది. హ్యుందాయ్ ఈ కొత్త కాంపాక్ట్ EV SUVతో భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సరసమైన ధర, ఆధునిక ఫీచర్లు, మెరుగైన రేంజ్ కలిపి ఈ కారును మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరికొంత టైమ్ పట్టనుంది.

Read Also: రెనాల్ట్ డ్యూయల్ ప్లాట్‌ఫారమ్ స్ట్రాటజీ.. ఏకంగా ఏడు కొత్త మోడళ్లు వచ్చేస్తున్నాయ్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×