E-Paper
Advertisement

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?
Advertisement

Hyundai Bayon-Based SUV Spied: హ్యుందాయ్ నుంచి త్వరలో మరో కొత్త మిడ్‌ సైజ్ SUV మార్కెట్లోకి రాబోతోంది. బేయాన్ ఆధారంగా రూపొందుతున్న ఈ కొత్త SUVకి సంబంధించిన ఇంటీరియర్ స్పై షాట్స్ తొలిసారి బయటకు వచ్చాయి. ఈ ఫొటోలను చూస్తే.. క్రెటాతో పోలిస్తే కొత్త SUVలో ఇంటీరియర్ మరింత లేటెస్ట్ గా, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ఉన్నట్లు కనిపిస్తోంది. పండుగ సీజన్‌లో ఈ SUVను మార్కెట్లోకి తీసుకురావచ్చని తెలుస్తోంది.

డ్యాష్‌ బోర్డ్‌ లో రెండు పెద్ద స్క్రీన్లు

కొత్త SUV ఇంటీరియర్‌ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది డ్యాష్‌ బోర్డ్‌ పై కనిపించే పెద్ద డిస్‌ ప్లే లు. స్పై ఫొటోల్లో వంపు తిరిగిన డ్యూయల్ స్క్రీన్ సెటప్ కనిపిస్తోంది. ఒక్కొక్కటి 12.3 అంగుళాల పరిమాణంలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వెన్యూ టాప్ వేరియంట్లలో కూడా ఇలాంటి డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక క్రెటాలో  10.25 అంగుళాల రెండు డిస్‌ ప్లేలు ఉన్నాయి. కొత్త SUVలో ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్‌ను కూడా మరింత అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి ఫీచర్లు నేరుగా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.

కొత్త స్టీరింగ్ వీల్

Advertisement

స్పై ఫొటోల్లో కనిపించిన మరో అంశం స్టీరింగ్ వీల్. ఇది వెన్యూ స్టీరింగ్‌ను పోలి ఉండే డ్యూయల్ టోన్ డిజైన్‌తో కనిపిస్తోంది. హ్యుందాయ్ కొత్త మోడళ్లలో కనిపిస్తున్న ప్రత్యేక గుర్తు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. నాలుగు చుక్కలతో ఉండే ఈ డిజైన్ మోర్స్ కోడ్‌ లో ‘H’ లెటర్ ను సూచిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ తో ఉన్న స్టీరింగ్ క్యాబిన్‌ లోని ఇతర డిజైన్‌తో కూడా సరిపోయేలా కనిపిస్తోంది.

బ్లాక్ అండ్ వైట్  క్యాబిన్‌

డోర్ ప్యానెల్స్‌ ను పరిశీలిస్తే.. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కలయిక కనిపిస్తోంది. ఇంటీరియర్ మొత్తం ఇదే తరహా కలర్ థీమ్‌తో ఉండే అవకాశం ఉంది. అలాగే డోర్లపై గుండ్రని హ్యాండిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత హ్యుందాయ్ మోడళ్లతో పోలిస్తే కొత్త SUVలో క్యాబిన్ డిజైన్‌కు కొంత భిన్నమైన రూపాన్ని ఇవ్వడానికి కంపెనీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

బయట డిజైన్ కూడా కొత్తగానే..

Advertisement

ఇంటీరియర్ మాత్రమే కాదు.. SUV బయట డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండనుంది. హ్యుందాయ్ కొత్తగా తీసుకొస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ శైలిని ఈ మోడల్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. ముందు, వెనుక భాగాల్లో T-ఆకారపు లైట్ బార్‌లు,   కొత్త అల్లాయ్ వీల్స్ కనిపించే అవకాశం ఉంది. బాడీ మీద షార్ప్ లైన్లు, కట్స్, క్రీజ్‌లు కూడా ఉండనున్నాయి.

CNGలోనూ వచ్చే అవకాశం

కొత్త SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు 115hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఇందులో మరోప్రత్యేకత CNG ఆప్షన్. అండర్‌బాడీ CNG ట్యాంక్‌తో ఈ SUVను తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే నాలుగు మీటర్లకు పైగా పొడవున్న CNG SUV విభాగంలో హ్యుందాయ్‌కు ఇది ప్రత్యేక మోడల్‌గా నిలుస్తుంది.  అండర్‌బాడీ CNG ట్యాంక్‌ తో వస్తే.. ఈ SUV నేరుగా మారుతి సుజుకి విక్టోరిస్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

Tags

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×