E-Paper
Advertisement

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్
Advertisement

Action Thriller: చావు అంటే వాళ్లకు భయం లేదు… వందల ఏళ్లుగా బతుకుతూ, ప్రపంచాన్ని కాపాడే యోధులు వాళ్లు. కానీ ఒక్కసారిగా వాళ్లలోనే ఒకరికి అమరత్వం పోయి, సాధారణ మనిషిలా మారిపోతే ? అదే సమయంలో ఇంతకాలం సముద్రం అడుగున బంధించబడి ఉన్న ఓ పాత శత్రువు తిరిగి వస్తే ? ప్రపంచాన్ని కాపాడే మిషన్ కంటే, ఈసారి తమ గతంతోనే పోరాడాల్సిన పరిస్థితి వస్తే ? చార్లీజ్ థెరాన్ ప్రధాన పాత్రలో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ ‘The Old Guard 2’. మొదటి భాగంలో పరిచయమైన అమర యోధుల బృందం ఈసారి మరింత ప్రమాదకరమైన మిషన్‌లోకి అడుగు పెడుతుంది. కొత్త శత్రువు, పాత ప్రతీకారం, అమరత్వం వెనుక దాగిన రహస్యం ఈ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మరి ఆ శత్రువు ఎవరు ? అమరత్వం కోల్పోయిన ఆండీ పరిస్థితి ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆండీ, నైల్, జో, నిక్కీ కలిసి శతాబ్దాలుగా మానవాళిని కాపాడే రహస్య మిషన్లు చేస్తుంటారు. వీళ్ల ప్రత్యేకత ఏంటంటే… సాధారణ మనుషుల్లా చనిపోరు. కానీ మొదటి భాగం చివర్లో జరిగిన పరిణామాల తర్వాత ఆండీ తన అమరత్వాన్ని కోల్పోయి సాధారణ మనిషిగా మారుతుంది. అయినా తన టీమ్‌ ను వదిలి పెట్టకుండా, ప్రపంచాన్ని కాపాడే పోరాటంలో ముందుండాలని నిర్ణయించుకుంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే… బుకర్ ఇంకా టీమ్‌కు దూరంగానే ఉంటాడు. మరోవైపు క్విన్ ఐదు శతాబ్దాల పాటు సముద్రం అడుగున బంధించబడిన తర్వాత బయటకు వస్తుంది. ఆమె మనసులో ఆండీపై ప్రేమతో పాటు కోపం, ప్రతీకారం కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో డిస్కార్డ్ అనే మరింత పురాతనమైన అమర శత్రువు రంగంలోకి దిగుతుంది. ఆమె లక్ష్యం కేవలం ఆండీని ఓడించడం కాదు, మనుషులపైనే ప్రతీకారం తీర్చుకోవడం.

అసలు డిస్కార్డ్‌ కు అమరత్వం గురించి ఏం తెలుసు ? ఆండీ తన శక్తులు లేకుండా ఈ ప్రమాదకరమైన పోరాటాన్ని ఎలా ఎదుర్కొంటుంది ? క్విన్ తిరిగి రావడంతో పాత బంధాలు ఎలా మారతాయి ? అమరుల జీవితానికి సంబంధించిన అసలు రహస్యం ఏంటి ? చివరికి ఆండీ టీమ్‌ ను కాపాడుకుంటుందా ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు థ్రిల్. ఈసారి యాక్షన్‌తో పాటు పాత్రల వ్యక్తిగత సంఘర్షణలకు కూడా కథలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

తెలుగులో ఉందా లేదా ?

Advertisement

విక్టోరియా మహోనీ దర్శకత్వం వహించిన ది ఓల్డ్ గార్డ్ 2’లో చార్లీజ్ థెరాన్, కికీ లేన్, మర్వాన్ కెన్జారి, లూకా మారినెల్లీ, మాథియాస్ స్కూనార్ట్స్, ఉమా థర్మన్, హెన్రీ గోల్డింగ్, చివెటెల్ ఎజియోఫర్ తదితరులు నటించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 47 నిమిషాలు. యాక్షన్, సూపర్‌పవర్స్, ఫాంటసీ, సస్పెన్స్ అంశాలతో ఈ సీక్వెల్ రూపొందింది. ఇప్పుడు Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. అమర యోధులు, సూపర్‌ పవర్స్, భారీ యాక్షన్, పాత శత్రువుల ప్రతీకారం, ఫాంటసీ థ్రిల్ ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి హై-వోల్టేజ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×