E-Paper
Advertisement

Hyundai Genesis X Skorpio: హ్యుందాయ్ నుంచి దుమ్మురేపే కారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Hyundai Genesis X Skorpio:  హ్యుందాయ్ నుంచి దుమ్మురేపే కారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Advertisement

Hyundai’s Wild Genesis X Skorpio Concept: దిగ్గజ ఆటోమేకర్ హ్యుందాయ్ ఎక్స్ స్కార్పియో కాన్సెప్ట్‌ ను ఆవిష్కరించింది. 1100hp పవర్, 1,152Nm టార్క్ ను  ఉత్పత్తి చేసే పవర్ ఫుల్ V8 ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఎడారి రేసింగ్ దుమ్మురేపుతున్నట్లుగా కంపెనీ ఫోటోలను విడుదల చేసింది. అచ్చం ట్రోఫీ ట్రక్కు మాదిరిగానే ఆకట్టుకుంటుంది. నిజానికి, ఈ కాన్సెప్ట్ హై స్పీడ్ ఆఫ్ రోడ్ రేసింగ్, ఎయిర్‌ బోర్న్ జంప్‌ ను నావిగేట్ చేయడం లాంటి ఎంటర్ టైనింగ్ డ్రైవింగ్ కోసం కంపెనీ రూపొందించింది.  X స్కార్పియో కాన్సెప్ట్ ఎక్స్ ట్రీమ్ గ్రౌండ్ క్లియరెన్స్, డెప్త్ బ్రేక్ ఓవర్ యాంగిల్స్ అందిస్తుంది. స్టాపింగ్ డ్యూటీ కోసం బ్రెంబో మోటార్‌ స్పోర్ట్ బ్రేక్‌లు ఉంటాయి.

జెనెసిస్ X స్కార్పియో కాన్సెప్ట్ ఎక్ట్సీరియర్ డిజైన్

ఈ కారు 2023 నుండి వచ్చిన జెనెసిస్ X గ్రాన్ బెర్లినెట్టా కాన్సెప్ట్‌ మాదిరిగానే కనిపిస్తుంది. వాస్తవానికి, X స్కార్పియో కాన్సెప్ట్  ఫ్లేర్డ్ ఫెండర్లు, బంపర్లు సూపర్‌ కార్ కాన్సెప్ట్‌ కు జెనెసిస్ ఒక ఎక్సోస్కెలిటన్‌ను ఫిక్స్ చేసినట్లు కనిపిస్తుంది. X స్కార్పియో కాన్సెప్ట్ V-ఆకారపు LED డే టైమ్ రన్నింగ్ లాంప్‌లను కలిగి ఉంది. ఇది జెనెసిస్ సిగ్నేచర్  టూ లైన్  డిజైన్‌కు ముందు ఫెండర్‌లకు విస్తరించి ఉంటుంది. నాలుగు LED హెడ్‌ లైట్ పాడ్‌లు DRLల కింద ఉన్నాయి. బోనెట్‌లో ఎలక్ట్రికల్ భాగాలను చల్లబరచడానికి ఎయిర్ ఇన్‌ టేక్‌లు ఉంటాయి. ఫంక్షనల్ రూఫ్ స్కూప్ క్యాబిన్‌కు అదే విధంగా పనిచేస్తుంది. ప్రొఫైల్‌లో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, ఎగ్జాస్ట్ అవుట్‌ లెట్లను కలిగి ఉంటుంది. కస్టమ్ 40 ఇంచెస్ ఆఫ్ రోడ్ టైర్లతో 18 ఇంచెస  బీడ్‌లాక్ రిమ్‌లు ర్యాలీ రేసర్ లుక్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

జెనెసిస్ X స్కార్పియో కాన్సెప్ట్ ఇంటీరియర్, ఫీచర్లు

Advertisement

ఇది రగ్గుడ్ ఆఫ్ రోడర్ కాన్సెప్ట్ అయినప్పటికీ, జెనెసిస్ X స్కార్పియో కాన్సెప్ట్ క్యాబిన్‌లో లగ్జరీ కోటీన్‌ను అలాగే ఉంచింది. ఇది చాలా సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ ను కలిగి ఉంటుంది. ట్రెడిషనల్ ట్రోఫీ ట్రక్కుల స్ట్రిప్డ్ డౌన్ యుటిలిటేరియనిజం మాదిరిగానే ఉంటుంది.  డ్రైవర్ డిస్‌ ప్లే త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్‌పై అమర్చబడి ఉంటుంది. డాష్‌ బోర్డ్ సోలో, కో పైలట్ డ్రైవింగ్ కోసం కాన్ఫిగర్ చేసే స్లైడబుల్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also:  రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!

Advertisement

ఇక భద్రతకు సంబంధించి X స్కార్పియో కాన్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ రోల్ కేజ్, ప్రయాణీకుల కోసం నాలుగు పాయింట్ల హార్నెస్ సిస్టమ్, మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.  X స్కార్పియో కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్, ఏ కారు బెస్ట్ అంటే?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×