E-Paper
Advertisement

Daldal Review : రెడ్ లైట్ ఏరియాలో పని చేసే పోలీస్… ‘దల్దల్’ సిరీస్ ఎలా ఉందంటే?

Daldal Review : రెడ్ లైట్ ఏరియాలో పని చేసే పోలీస్… ‘దల్దల్’ సిరీస్ ఎలా ఉందంటే?
Advertisement

Daldal Review : హీరోయిన్ భూమి పెడ్నేకర్ లేడి ఓరియెంటెడ్ సిరీస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గత సంవత్సరం “భక్షక్” వంటి క్రైమ్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు “దల్దల్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “భిండి బజార్” పుస్తకం నుండి ప్రేరణ పొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు దర్శకుడు అమృత్‌రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ అంచనాలను అందుకుందా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ

ముంబై క్రైమ్ బ్రాంచ్ DCP రీటా ఫెర్రీరా (భూమి పెడ్నేకర్), ఓ కేసు నిమిత్తం ఎనిమిది వారాల పాటు ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతంలో టీచర్‌ గా నటిస్తుంది. అక్కడ పిల్లల అక్రమ రవాణాకు సంబందించిన ముఠాను పట్టుకుంటుంది. ఈ ఆపరేషన్‌ సక్సెస్ కావడంతో రీటాకు ప్రమోషన్ లభిస్తుంది. బాల్యం నుంచి రీటా జీవితం కష్టాల్లోనే నడిచింది. ఇక ఇప్పుడు కూడా ప్రియుడి నుండి కూడా విడిపోవాలని కోరుకుంటుంది. ఇలా పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్ అవుతున్న ఆమెకు ప్రమోషన్ గురించిన ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇంతలో ముంబైలో వరుస హత్యలు ప్రారంభమవుతాయి. కేసును పరిష్కరించే బాధ్యత రీటాపై పడుతుంది. ఈ కేసును ఎలాగైనా కొలిక్కి తేవాలని, తనను తాను నిరూపించుకోవాలని ఆమె అనుకుంటుంది. ఇంతలో కథ డ్రగ్స్ కి బానిస అయిన సాజిద్ (ఆదిత్య రావల్), అతని స్నేహితురాలు అనిత చుట్టూ తిరుగుతుంది. ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌ ఉచ్చులో కూడా రీటా పడుతుంది. చివరికి రీటా కిల్లర్ ను పట్టుకోగలదా? ఆమె తన ప్రేమను నిలబెట్టుకుంటుందా ? తనను తాను నిరూపించుకోగలదా? సాజిద్, అనిత పాత్రలు ఇందులో ఎలాంటి మలుపులు తెస్తాయి ? అనే విషయాల చుట్టూ ఈ సిరీస్ మిగతా కథ నడుస్తుంది.

విశ్లేషణ

Advertisement

ఈ సిరీస్ లో కథ మూడు భాగాలుగా నడుస్తుంది. మొదటి భాగంలో కథ పిల్లల అక్రమ రవాణా గురించి, రెండవ భాగంలో వరుస హత్యలపై ఆధారపడి ఉంటుంది. చివరలో పాత్రల గత గాయాల గురించి ఉంటుంది. ఏడు ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌ క్లైమాక్స్ వరకు వివిధ పాత్రల ఎంట్రీతో కన్ఫ్యూజ్ గా సాగుతుంది. సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ లో ఆసక్తిని పెంచే ట్విస్ట్ వస్తూ ఉంటుంది. అయితే నిజమైన హంతకుడు ఎవరు ? అనే విషయమై ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయడానికి దర్శకుడు చాలాసార్లు ప్రయత్నించాడు. మొదటి రెండు ఎపిసోడ్లలోనే కథను చెప్పేశారు. తరువాత ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి మిగతా ఎపిసోడ్స్ చూడాల్సి ఉంటుంది. అక్కడక్కడా సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ప్రీ-క్లైమాక్స్ అతిగా అన్పిస్తుంది. చివరికి వచ్చే కొద్దీ చాలా బలహీనంగా మారుతుంది.

ఈ సిరీస్ ప్రధాన బలం కథనం. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి. అయితే చాలా సన్నివేశాల్లో ముఖాలను కూడా స్పష్టంగా చూపించలేకపోయారు. ఎడిటింగ్ లో కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. నటన పరంగా అందరు తమ బెస్ట్ ఇచ్చారు. లేడి పోలీస్ ఆఫీసర్ గా భూమి పెడ్నేకర్ ఆకట్టుకుంటుంది. ఆదిత్య రావల్ మాదకద్రవ్యాల బానిసగా, ఆత్మహత్య చేసుకునే షాహిద్ పాత్రను అద్భుతంగా పోషించారు. సమర తిజోరి తన పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేసింది. గీతా అగర్వాల్ తన నటనతో సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అద్భుతంగా నటించారు. .

ప్లస్ పాయింట్స్

Advertisement

కొన్ని క్రైమ్ సీన్స్ ఆడియన్స్ లో భయం పుట్టిస్తాయి.
నటన
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ 

సస్పెన్స్ పెద్దగా లేకపోవడం.

సగం సిరీస్ లైటింగ్ సరిగ్గా లేకపోవడం

ఫ్లాష్‌బ్యాక్‌లను పదే పదే చూపించడం

చివరి రెండు ఎపిసోడ్‌లు ల్యాగ్ .

మొత్తానికి

వీకెండ్ కొత్తగా చూడటానికి ఏమీ లేకపోతే భూమి పెడ్నేకర్ కోసం ఒకసారి ఈ సిరీస్ ని చూడవచ్చు.

రేటింగ్ : 2.5/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×