E-Paper
Advertisement

Jawa vs Royal Enfield: జావా 42 బాబర్ vs రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350.. ఏ కారు కొనాలంటే?

Jawa vs Royal Enfield: జావా 42 బాబర్ vs రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350.. ఏ కారు కొనాలంటే?
Advertisement

Jawa vs Royal Enfield Comparison: జావా 42 బాబర్, రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్స్ ప్రస్తుతం ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. ఈ రెండు బైక్స్ వేర్వేరు అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. 42 బాబర్ 334cc ఇంజిన్, అగ్రెసివ్ ఫ్యాక్టరీ కస్టమ్ స్టైలింగ్‌ ను అందిస్తుంది. అయితే గోవాన్ క్లాసిక్ 350 349cc ఇంజిన్, రెట్రో లుక్, రిలాక్స్డ్, టార్కీ రైడ్‌ను అందిస్తుంది. 42 బాబర్ యాక్సిలరేషన్ అద్భుతంగా ఉంటుంది. గోవాన్ సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

జావా 42 బాబర్ vs రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 పోలికలు

⦿ పనితీరు: 42 బాబర్ 334cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 6 స్పీడ్ గేర్లను కలిగి ఉంటుంది. ఇది 29.51 bhp పవర్ ను అందిస్తుంది. ఇది సిటీ, హైవే ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. గోవాన్ క్లాసిక్ 350  349cc J-సిరీస్ ఇంజిన్ ను కలిగి ఉంటంది. 20.2 bhp పవర్ ను అందిస్తుంది.  5 స్పీడ్ గేర్లను కలిగి ఉంటుంది. ఇది తక్కువ RPM దగ్గర సున్నితమైన, రిలాక్స్డ్, టార్క్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.

Advertisement

⦿ డిజైన్,  కంఫర్ట్: జావా 42 బాబర్ సింగిల్ సీటును కలిగి ఉంటుంది. సీటు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది. మినిమలిస్ట్, అగ్రెసివ్ లుక్ ను కలిగి ఉంటుంది. గోవాన్ క్లాసిక్ 350 కొంచెం ఎత్తుగా ఉంటుంది. మరింత ట్రెడిషనల్ క్రూయిజర్ స్టాన్స్, ఏప్ హ్యాంగర్ హ్యాండిల్‌ బార్లు, మరింత సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంటుంది.

⦿ కీ ఫీచర్లు: 42 బాబర్‌ లో పూర్తిగా డిజిటల్ కన్సోల్ ఉంటుంది. కొన్ని వెర్షన్లలో అడ్జెట్ చేసే సీటు ఉంటుంది. కానీ, బ్లూటూత్ లేదు. గోవాన్ క్లాసిక్ 350 రెట్రో అనలాగ్ డిజిటల్ క్లస్టర్‌ ను కలిగి ఉంటుంది. అయితే ప్రైమరీగా, బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. రెండింటిలోనూ ABS ఉంటుంది.

Advertisement

⦿ ధర,  మైలేజ్: 42 బాబర్ సాధారణంగా కొంచెం తక్కువగా ప్రారంభ ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 1.95 లక్షల నుంచి రూ. 2.18 లక్షల వరకు ఉంటుంది. అయితే, గోవాన్ క్లాసిక్ 350 ధర రూ. 2.20 లక్షల నుంచి రూ. 2.23 లక్షల వరకు ఉంటుంది. దీనిని ఎక్కువ ప్రీమియంగా భావిస్తారు. గోవాన్ క్లాసిక్ సాధారణంగా 42 బాబర్ తో పోల్చితే కాస్త మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. గోవాన్ క్లాసిక్ లీటర్ కు 33-37 కిమీ మైలేజ్ ఇస్తుంది. 42 బాబర్ 30 కిమీ మైలేజ్ ఇస్తుంది.

ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందంటే?

భై పర్ఫార్మెన్స్, లేటెస్ట్ రెట్రో లుక్, సోలో రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇష్టపడితే జావా 42 బాబర్‌ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా మెరుగైన సౌకర్యం, రిలాక్స్డ్ లాంగ్ డిస్టెన్స్ రైడింగ్, లేటెస్ట్ సౌకర్యాలతో కూడిన క్లాసిక్ స్టైలింగ్, మరింత రిలాక్స్డ్ రైడ్ క్యారెక్టర్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 తీసుకోవడం మంచిది.

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ vs యమహా EC-06.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే మంచిదంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×