E-Paper
Advertisement

TVS iQube vs Yamaha EC-06: టీవీఎస్ ఐక్యూబ్ vs యమహా EC-06.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే మంచిదంటే?

TVS iQube vs Yamaha EC-06: టీవీఎస్ ఐక్యూబ్ vs యమహా EC-06.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే మంచిదంటే?
Advertisement

TVS iQube vs Yamaha EC-06 Comparison: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. హైస్పీడ్, మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. టాప్ బ్రాండ్ల నుంచి అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్కూటర్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో టీవీఎస్ ఐక్యూబ్ ST మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గానే యమహా EC-06 విడుదల అయ్యింది. ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఎక్కువ పరిధి కావాలంటే ఐక్యూబ్ బెస్ట్ ఆప్షన్ కాగా, స్టైలిష్, రగ్గడ్ డిజైన్ కావాలంటే EC-06ని ఎంచుకోవడం బెస్ట్. ఇంతకీ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? ఏది ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీఎస్ ఐక్యూబ్ ST vs యమహా EC-06 మధ్య పోలికలు  

⦿ రేంజ్: టీవీఎస్ ఐక్యూబ్ ST 5.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది సుమారు 212 కిమీ రేంజ్ ను ఇస్తుంది. అటు  యమహా EC-06 4 kWh బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్ మీద ఈ స్కూటర్ 169 కిమీ రేంజ్‌ను ఇస్తుంది.

Advertisement

⦿ మోటార్, పెర్ఫార్మెన్స్: యమహా EC-06  6.7 Kw శక్తివంతమైన మోటార్‌ను కలిగి ఉంది. అటు ఐక్యూబ్ ST 140 Nm వీల్ టార్క్ తో మెరుగైన ఎఫిషియన్సీని ఇస్తుంది.

⦿ వీల్స్, బ్రేక్స్: యమహా EC-06 14 అంగుళాల పెద్ద వీల్స్ ను కలిగి ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌ లను కలిగి ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ST 12 ఇంచుల వీల్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ఫీచర్లు,  స్టోరేజ్: TVS iQube ST 7-అంగుళాల TFT స్క్రీన్ మరియు 32L స్టోరేజ్‌తో వస్తుంది. ఇది కుటుంబ అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. యమహా EC-06 రగ్గడ్ డిజైన్, పెద్ద స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

⦿  ఛార్జింగ్: ఐక్యూబ్ ST 950W ఛార్జర్‌ తో 4 గంటల్లో ఛార్జ్ కాగా, యమహా EC-06 కు సుమారు 8 గంటలు పడుతుంది.

Read Also:  తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

ఏ స్కూటర్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?   

ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే కుటుంబ సభ్యులకు టీవీఎస్ ఐక్యూబ్ ST అనుకూలంగా ఉంటుందట. ఒకవేళ స్టైల్, మంచి వీల్స్ స్థిరత్వాన్ని, రగ్గడ్ బిల్డ్ క్వాలిటీని కోరుకుంటే యమహా EC-06ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also:  సుజుకి యాక్సెస్ ABS వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత అంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×