E-Paper
Advertisement

Jawa 42: ఐవరీ వైట్ కలర్ లో జావా 42 బైక్ లాంచ్, లుక్ అదిరింది గురూ!

Jawa 42: ఐవరీ వైట్ కలర్ లో జావా 42 బైక్ లాంచ్, లుక్ అదిరింది గురూ!
Advertisement

Jawa 42 New Colour: ప్రముఖ మోటార్ సైకిల్స్ కంపెనీ జావా, దేశీ మార్కెట్ లోకి సరికొత్త కలర్ లో జావా 42 బైక్‌ ను లాంచ్ చేసింది. కొత్త ఐవరీ వైట్ కలర్ ఆప్షన్‌ తో ఆకట్టుకుంటుంది. ఈ కొత్త షేడ్ బైక్‌ రేట్రో టచ్‌ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌ లో చెక్కర్ ఫ్లాగ్ గ్రాఫిక్స్, పాస్టెల్ బాడీ వర్క్, బోల్డ్ డికల్స్ లాంటి క్రేజీ డిజైన్ తో అలరిస్తుంది. ఈ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేకపోయినా, కలర్ వేరియంట్ ను మాత్రమే పరిచయం చేసింది. ఈ కలర్ బైక్ కు కొత్త లుక్ ను అందిస్తుంది. ఈ కలర్ తో ఈ బైక్ మొత్తం 15 రంగుల్లో కనిపిస్తుంది. అన్నింటితో పోల్చితే  ఐవరీ వైట్ మరింత స్పెషల్ గా కనిపిస్తుంది. ఇక ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జావా 42 ఇంజిన్ గురించి..

జావా 42 అనేది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బైక్‌ లో 294.7 cc సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 27.3 PS పవర్, 26.8 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. ట్విన్ ఎగ్జాస్ట్ డిజైన్ బైక్‌ మంచి సౌండ ను అందిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ బైక్ 33 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

జావా 42 ఫీచర్లు, ధర

Advertisement

ఇక ఈ బైక్ లో క్రేజీ ఫీచర్స్ ఉన్నాయి. డిజిటల్ అనలాగ్ స్పీడోమీటర్, అలాయ్ వీల్స్, ట్యూబ్‌ లెస్ టైర్స్, డ్యూయల్ ఛానల్ ABS, లేటెస్ట్ డిజిటల్ డిస్ ప్లే ఉన్నాయి. బార్ ఎండ్ మిర్రర్స్ లాంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నీయో క్లాసిక్ లుక్‌ ను కలిగి ఉండేలా చేస్తాయి. ఇక భద్రత విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీ ఉంటుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుక గ్యాస్ ఫిల్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. డబుల్ క్రేడిల్ ఫ్రేమ్ బైక్‌ కు బలమైన నిర్మాణాన్ని ఇస్తుంది.  13.2 లీటర్ల పెట్రోల్ ట్యాంట్ కుంటుంది. ఇండియన్ మార్కెట్ లో జావా 42 బైక్‌ ప్రారంభ ధర రూ. 1.84 లక్షల నుంచి ఉంటుంది.

కొత్త కలర్ కలిసి వచ్చేనా?

జావా 42 సరికొత్త ఐవరీ వైట్ వేరియంట్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. రెట్రో స్టైల్, ఆధునిక ఫీచర్లు, పవర్ ఫుల్  ఇంజిన్, సేఫ్టీ టెక్నాలజీ బైక్‌ ను స్పెషల్ గా కనిపించేలా చేస్తున్నాయి. ఈ బైక్ తో మార్కెట్ లో మరింత సత్తా చాటేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

Advertisement

Read Also: రూ. 1.5 లక్షల్లోపు యమహా FZ సిరీస్ బైక్‌లు, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×