E-Paper
Advertisement

Yamaha FZ Series: రూ. 1.5 లక్షల్లోపు యమహా FZ సిరీస్ బైక్‌లు, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Yamaha FZ Series: రూ. 1.5 లక్షల్లోపు యమహా FZ సిరీస్ బైక్‌లు, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

Yamaha FZ Series Bikes: భారత్ లో యువతను బాగా ఆకట్టుకునే బైక్స్ లో యమహా మోడల్స్. వీటిలో FZ సిరీస్ బైక్స్ మరింత క్రేజ్ ఉంది. రూ. 1.5 లక్షల లోపు లభించే యమహా FZ సిరీస్ బైక్స్ అద్భుతమైన స్టైల్, మైలేజ్, ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ సిరీస్‌ లో FZS-FI V4, FZS-FI V3, FZ-X,కొత్త FZ-RAVE మోడల్స్ ఉన్నాయి. ఇవి 149cc ఇంజిన్‌ తో సుమారు 45-60 కిలో మీటర్ల మైలేజీని అందిస్తున్నాయి. లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ, ABS, LED లైటింగ్ లాంటి ఫీచర్లతో వస్తున్నాయి.  ప్రస్తుతం ఇండియాలోని రూ. 1.5 లక్షల లోపు ముఖ్యమైన యమహా FZ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Yamaha FZS-FI V4 Deluxe: ఈ బైక్ ధర సుమారు రూ.1.29 లక్షల నుంచి రూ. 1.35 లక్షల వరకు ఉంటుంది. ఈ సిరీస్‌ లో అత్యంత మోడ్రన్ బైక్. ఇది 149cc, E20 ఇంధన సామర్థ్యం ఉన్న ఇంజిన్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ Yamaha FZ-X: ఈ బైక్ ధర సుమారు రూ.1.21 లక్షల నుంచి రూ. 1.39 లక్షలు ఉంటుంది. ఇది రెట్రో స్టైల్ మోడల్ గా మార్కెట్ లోకి ఉంటుంది. ఇది క్లాసీ లుక్, ఆన్ రోడ్ సౌకర్యాన్ని ఇస్తుంది. ఇందులోనూ బ్లూటూత్ కనెక్టివిటీ, హైబ్రిడ్ ఆప్షన్లు ఉన్నాయి.

⦿ Yamaha FZS-FI V3: ఈ బైక్ ధర సుమారు రూ. 1.13 లక్షల నుంచి రూ. 1.26 లక్షలు ఉంటుంది. బడ్జెట్‌లో మంచి స్పోర్టీ లుక్,  విశ్వసనీయత కోసం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది 149cc, 55 కిలో మీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఇంజిన్‌తో వస్తుంది.

Advertisement

⦿ Yamaha FZ-RAVE: ఈ బైక్ ధర సుమారు రూ. 1.20 లక్షలు ఉంటుంది. ఇది కొత్తగా వచ్చిన మోడల్. అద్భుతంగా ఆకట్టుకునే గ్రాఫిక్స్, అప్‌డేటెడ్ స్టైలింగ్‌ తో వస్తుంది. మంచి పవర్ ఫుల్ ఇంజిన్ తో పాటు చక్కటి మైలేజీని అందిస్తుంది.

Read Also:  రైడర్స్ గ్లోవ్స్ పెట్టుకుంటే ఇన్ని లాభాలున్నాయా? మీరూ అస్సలు మిస్సవ్వకండి!

యమహా FZ మోడల్స్ కీ ఫీచర్లు  

⦿ ఇంజిన్: ఈ మోడల్స్ బైక్స్ అన్నీ 149cc, Air-cooled, 4-stroke, SOHC, 2-valve ఇంజిన్ తో వస్తున్నాయి.

⦿ మైలేజ్: ఈ సిరీస్ బైక్స్ అన్నీ  సుమారు 45 నుంచి 60 కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి. రోడ్ కండిషన్స్ బట్టి కాస్త అటు ఇటుగా ఉంటుంది.

⦿ ఫీచర్లు: యమహా FZ మోడల్స్ అత్యాధునిక బ్లూటూత్, ABS, LED లైటింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డిజిటల్ మీటర్ లాంటి ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో, ఈ వైక్స్ లో మీకు ఏది నచ్చిందో చెప్పేయండి!

Read Also:  రైడర్స్ గ్లోవ్స్ పెట్టుకుంటే ఇన్ని లాభాలున్నాయా? మీరూ అస్సలు మిస్సవ్వకండి!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×