Jawa and Yezdi Festive Offers: పండుగల సీజన్ లో కొత్త బైక్ కొనాలని చూస్తున్నవారికి క్లాసిక్ లెజెండ్స్ గుడ్ న్యూస్ అందించింది. జావా, యెజ్డీ, బీఎస్ఏ బైక్స్ మీద స్పెషల్ ఫైనాన్సింగ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లతో కొనుగోలుదారులు డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు, పేమెంట్ టైమ్ కూడా ఎక్కువగా అందిస్తోంది.
ఈ పండుగ ఆఫర్లలో కంపెనీ 100 శాతం ఫండింగ్ అందిస్తోంది. అంటే, కస్టమర్లకు బైక్ ధర మొత్తానికి ఫైనాన్సింగ్ లభించే అవకాశం ఉంటుంది. దీంతో కొనుగోలు సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సదుపాయం అందరికీ వర్తించదు. ఫైనాన్షియల్ అర్హత, ఆదాయం, క్రెడిట్ వివరాలు, ఫైనాన్సింగ్ సంస్థ నిబంధనల ఆధారంగా ఆమోదం లభిస్తుంది.
కొత్త బైక్ కొనుగోలు చేసేవారికి మరో బెనిఫిట్, ఫైనాన్స్ డబ్బులు చెల్లించే గడువు. 72 నెలల వరకు డబ్బులు చెల్లించే అవకాశం కల్పిస్తోంది. వడ్డీ రేట్లు 5.99 శాతం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. దీంతో తమ నెలవారీ బడ్జెట్ కు అనుగుణంగా ఫైనాన్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే, తక్కువ నెలవారీ వాయిదా కోసం ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే మొత్తం చెల్లించే వడ్డీ పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
ఈ ఆఫర్లలో Buy Now, Pay Later లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. కొన్ని ఫైనాన్సింగ్ స్కీమ్ లలో హైపోథెకేషన్ అవసరం లేని వెసులుబాటు కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మహీంద్రా గ్రూప్ ఉద్యోగుల కోసం స్పెషల్ బైక్ మెయింటెనెన్స్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది.
జావా 42 ఓజీ ధరలు రూ.1.87 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, జావా 350 ధర రూ.2.11 లక్షల నుంచి రూ.2.22 లక్షల వరకు ఉన్నాయి. యెజ్డీ రోడ్స్టర్ ధర సుమారు రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అడ్వెంచర్ మోడల్ ధర రూ.2.33 లక్షలుగా ఉంది. ప్రీమియం బైక్లను కోరుకునేవారి కోసం బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 ధర రూ.3.25 లక్షల నుంచి రూ.3.41 లక్షల వరకు ఉండగా, గోల్డ్ స్టార్ 650 ధర రూ.3.42 లక్షల నుంచి రూ.3.65 లక్షల వరకు ఉంది.
ఈ ఫైనాన్సింగ్ ఆఫర్లకు సంబంధించిన మోడల్ వారీ ప్రయోజనాలను కంపెనీ వెల్లడించలేదు. సో, ఏ బైక్పై ఎంత ఫైనాన్స్ లభిస్తుంది? వడ్డీ రేటు ఎంత? ఇతర ఛార్జీలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలను డీలర్ను సంప్రదించి తెలుసుకోవడం మంచిది.
Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?