E-Paper
Advertisement

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Upcoming Jeep SUVs in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు జీప్ రెడీ అవుతోంది. దేశీయ వినియోగదారుల కోసం ఏకంగా నాలుగు కొత్త SUVలు, ఒక లైఫ్‌ స్టైల్ పికప్ ట్రక్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. స్టెల్లాంటిస్ ప్రకటించిన ‘ఫాస్ట్‌ లేన్ 2030’ వ్యూహంలో భాగంగా ఈ కొత్త మోడల్స్  మార్కెట్లోకి రానున్నాయి. దీంతో పాటు సిట్రోయెన్ బ్రాండ్ కింద మరో ఏడు కొత్త వెహికల్స్ ను కూడా పరిచయం చేయాలని భావిస్తోంది.

2027 నుంచి కొత్త మోడళ్ల సందడి..

స్టెల్లాంటిస్ తాజా ప్రణాళిక ప్రకారం.. ఈ కొత్త మోడల్స్ 2027 సెకెండ్ క్వార్టర్స్ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే, అన్ని వెహికల్స్ పేర్లు, ధరలు, పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు, టాటా మోటార్స్‌ తో స్టెల్లాంటిస్ కుదుర్చుకున్న ఒప్పందం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. టాటా ఆర్గోస్ ఆర్కిటెక్చర్ ఆధారంగా కొత్త మిడ్‌సైజ్ SUVని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై రూపొందే వాహనాల్లో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మోడల్ 2028 ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

చిన్న SUVతో కొత్త సెగ్మెంట్ లోకి ఎంట్రీ..

Advertisement

జీప్ తీసుకురానున్న కొత్త B-SUV కంపెనీకి కీలకమైన మోడల్‌ కానుంది. ప్రస్తుతం ఉన్న కంపాస్ కంటే దిగువన స్థానం పొందే ఈ SUV, జీప్ బ్రాండ్‌లో మరింత అందుబాటు ధరలో లభించే వెహికల్ కానుంది. కాంపాక్ట్ SUV విభాగంలో స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కంపాస్‌కు తోడుగా మరో మిడ్‌సైజ్ SUV..

కొత్త C-SUV మోడల్‌ ను కంపాస్‌ తో పాటు అమ్మే అవకాశం ఉంది. విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కోరుకునే కుటుంబ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. సిటీ ప్రయాణాలతో పాటు హైవేలపై కూడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా దీనిని రూపొందిస్తున్నారు.

ప్రీమియం SUV, పికప్ ట్రక్‌ కూడా.. 

Advertisement

జీప్ కొత్త D-SUV మూడు వరుసల సీట్లతో కూడిన ప్రీమియం వెహికల్ గా వచ్చే అవకాశం ఉంది. ఇందులో అధునాతన సాంకేతికతతో పాటు జీప్‌కు ప్రత్యేకమైన ఆఫ్‌ రోడ్ సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అయితే, ఇది గ్రాండ్ చెరోకీకి కొత్త రూపమా? లేక పూర్తిగా కొత్త మోడలా? అనేది త్వరలో తెలియనుంది. ఇక D-పికప్ విభాగంలో జీప్ గ్లాడియేటర్‌ను భారత్ కు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ బలమైన నిర్మాణం, కఠినమైన రోడ్లపై ప్రయాణించే సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Read Also: కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Tags

Related News

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

Big Stories

Advertisement
×