E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 4.26 లక్షలుగా నిర్ణయించింది. స్పెషల్ కలర్స్, అదిరిపోయే డిజైన్‌తో వస్తున్న ఈ బైక్ భారత్‌ లో కేవలం 125 యూనిట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానుండగా, డెలివరీలు నవంబర్‌లో మొదలవుతాయి.

ప్రత్యేకమైన రంగులతో కొత్త క్లాసిక్ 650

క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్‌లో ప్రధాన ఆకర్షణ దాని స్పెషల్ పెయింట్ ఫినిష్. కాంతి పడే కోణాన్ని బట్టి రెడ్, గ్రీన్, గోల్డ్ కలర్ లో కనిపించడం ఈ బైక్ ప్రత్యేకత. క్లాసిక్ 650తో పోలిస్తే ఇంజిన్, మెకానికల్ భాగాల్లో మార్పులు చేయలేదు.  డిజైన్‌ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఫ్యూయల్ ట్యాంక్‌పై 125వ వార్షికోత్సవానికి సంబంధించిన స్పెషల్ లోగోను ఏర్పాటు చేశారు. సైడ్ ప్యానెళ్లపై స్పెషల్ బ్యాడ్జింగ్‌తో పాటు చేతితో వేసిన పిన్‌స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. ఈ వివరాలు బైక్‌ కు స్పెషల్ లుక్ ను  అందిస్తాయి.

ఇంజిన్, పనితీరు గురించి..

Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్‌ లో 648సీసీ ఎయిర్‌ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 47 హెచ్‌పీ పవర్, 52.3 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ను ఇంటర్‌ సెప్టర్ 650 లాంటి ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఛాసిస్‌ ను సూపర్ మీటియోర్ 650 నుంచి తీసుకున్నారు. అయితే, సూపర్ మీటియోర్‌లో ఉండే అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌కు బదులుగా క్లాసిక్ 650లో సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్‌ ను అందించారు.

ధర గురించి..   

క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ ధర రూ. 4.26 లక్షలు. సాధారణ క్లాసిక్ 650 వల్లం రెడ్ వేరియంట్ ధర రూ. 3.68 లక్షలు కాగా, బ్లాక్ క్రోమ్ వేరియంట్ ధర రూ. 3.82 లక్షలుగా ఉంది. దీంతో హైపర్‌షిఫ్ట్ ఎడిషన్ బేస్ మోడల్ కంటే రూ. 58,000, టాప్ వేరియంట్ కంటే రూ. 43,500 ఎక్కువ ధరతో అందుబాటులోకి వచ్చింది.

125 యూనిట్లు మాత్రమే!

Advertisement

ఈ స్పెషల్ ఎడిషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 16న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 28న ముగుస్తాయి. అదే రోజు అమ్మకాలు ప్రారంభమవుతాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో ఈ ప్రత్యేక మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు త్వరగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  డెలివరీలు నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి.

Read Also: టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

Tags

Related News

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×