E-Paper
Advertisement

Jeep Wrangler: రాంగ్లర్ విల్లీస్ 41ను రీలాంచ్ చేసిన జీప్, ధర ఎంతో తెలుసా?

Jeep Wrangler: రాంగ్లర్ విల్లీస్ 41ను రీలాంచ్ చేసిన జీప్, ధర ఎంతో తెలుసా?
Advertisement

Jeep Wrangler Willys 41 Edition: జీప్ ఇండియా రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్‌ను దేశీ మార్కెట్ లోకి రీ లాంచ్ చేసింది. రూబికాన్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడిన ఈ వెహికిల్, తొలిసారి 2025లో భారత మార్కెట్‌ కు పరిచయం అయ్యింది. తాజాగా రీ లాంచ్ చేసిన 41 యూనిట్ లాట్ కేవలం వారంలోనే సేల్ అయ్యాయి. మరోసారి 41 యూనిట్లతో రాంగ్లర్ విల్లీస్ 41 2.0 వెర్షన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్‌ షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి.

రాంగ్లర్ విల్లీస్ 41 ధర ఎంత అంటే?

ఈ  పరిమిత ఎడిషన్ ధర రూ. 70.31 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రామాణిక కారు కంటే రూ. 2 లక్షలు ధర ఎక్కువగా ఉంటుంది. అయితే, రూ. 3.60 లక్షల ప్రత్యేక ధరతో ఆప్షనల్, ఎక్స్ క్లూసివ్ యాక్సెసరీస్ ను పొందే అవకాశం ఉంటుంది. రాంగ్లర్ విల్లీస్ 41 యాక్సెసరీస్ లిస్టులో మోటరైజ్డ్ సైడ్ స్టెప్స్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వీడియో రికార్డర్ ఉన్నాయి. విల్లీస్ 41లో ఆప్షనల్ కిట్ కూడా ఉంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ సైడ్ ల్యాడర్, సన్‌ రైడర్ రూఫ్‌ టాప్‌ తో కూడిన రూఫ్ క్యారియర్ ఉన్నాయి.

Advertisement

Read Also: టాటా సియెర్రా EV To మహీంద్రా XUV.e8.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఈవీలు!

రాంగ్లర్ విల్లీస్ 41 ఇంజిన్ గురించి..

రాంగ్లర్ విల్లీస్ 41 ఎడిషన్ 2.0-లీటర్, 4 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 266 BHP పవర్, 400 Nm టార్క్ ను  ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్, 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో యాడ్ చేయబడి ఉంటుంది.

Advertisement

Read Also: టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ చౌకైన వేరియంట్ వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

జీప్ ఇండియా అధికారులు ఏం చెప్పారంటే?

రాంగ్లర్ విల్లీస్ 41 ఎడిషన్ లాంచింగ్ సందర్భంగా జీప్ ఇండియా అధికారులు కీలక ప్రకటన చేశారు. స్టెల్లాంటిస్ ఇండియా ఆటోమోటివ్ బ్రాండ్స్ బిజినెస్ హెడ్,  డైరెక్టర్ కుమార్ ప్రియేష్ ఈ కారు గురించి పలు విషయాలు వెల్లడించారు. విల్లీస్ వారసత్వం గురించి చాలా పెద్ద చరిత్ర ఉందన్నారు. ఇది జీప్ పాత్రకు పునాదిగా రాయిగా అభివర్ణించారు. రాంగ్లర్ విల్లీస్ 41 2.0 ఆ వారసత్వానికి కొనసాగింపుగా ఉంటుందన్నారు. ఇది 1941 విల్లీస్ MB మాదిరి లుక్ తో ఆకట్టుకుంటుందన్నారు. అదే సమయంలో జీప్ యజమానులు మంచి సామర్థ్యం, ​​ప్రామాణికతతో మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. సమకాలీన ఇంజనీరింగ్‌ తో విల్లీస్ సరికొత్తగా రూపుదిద్దుకుందన్నారు. చక్కటి సామర్థ్యంతో జీప్ ప్రతిష్టను ఈ మోడల్ మరింత నిలబెడుతుందన్నారు.

Read Also:  నిస్సాన్ టెక్టన్ To స్కోడా కుషాక్ ఫేస్‌ లిఫ్ట్, మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ కార్లు!

Related News

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

Big Stories

Advertisement
×