E-Paper
Advertisement

Samsung Price Hike: శాంసంగ్ ఫ్యాన్స్‌కు షాక్.. గెలాక్సీ A, F సిరీస్ ఫోన్ల ధరలు పెంచేసిన కంపెనీ.. కొత్త ధరలు ఇవే

Samsung Price Hike: శాంసంగ్ ఫ్యాన్స్‌కు షాక్.. గెలాక్సీ A, F సిరీస్ ఫోన్ల ధరలు పెంచేసిన కంపెనీ.. కొత్త ధరలు ఇవే
Advertisement

Samsung Price Hike| శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఒక చేదు వార్త. గెలాక్సీ A, F సిరీస్‌లోని చాలా మోడల్స్ ధరలను కొరియన్ టెక్ కంపెనీ పెంచేసింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 25, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. కొన్ని వేరియంట్లలో ధరలు రూ.2,000 వరకు పెరిగాయి. గెలాక్సీ A56, A36, F17 5G వంటి మోడల్స్ ఈ ధర పెంపునకు గురయ్యాయి. శాంసంగ్ ధర పెంచడానికి అధికారిక కారణం చెప్పలేదు. కానీ ఇండస్ట్రీ నిపుణులు భారత కరెన్సీ రూపాయి బలహీనత, ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరల పెరుగుదల, సప్లై చైన్ ఖర్చులను కారణాలుగా చెబుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ A56 కొత్త ధరలు

గెలాక్సీ A56 రెండు వేరియంట్ల ధరలు పెరిగాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.44,999 అయింది. ముందు ధర రూ.43,999 ఉండేది. ఇప్పుడు రూ.1,000 పెరిగింది. 12GB RAM + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.48,999 అయింది. ఇంతకుముందు ధర రూ.46,999 ఉండేది. ఈ వేరియంట్‌ ధర రూ.2,000 పెరిగింది. రెండు స్టోరేజ్ ఆప్షన్లకూ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించాలి.

గెలాక్సీ A36 కొత్త ధరలు

Advertisement

గెలాక్సీ A36 లైనప్ ధరలు కూడా మారాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ఇప్పుడు రూ.36,499 అయింది. ముందు ధర రూ.35,499 ఉండేది. రూ.1,000 పెరిగింది. 12GB RAM + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.40,499 అయింది. ఇంతకు ముందు ధర రూ.38,499 ఉండేది. ఈ వేరియంట్‌ ధర కూడా రూ.2,000 పెరిగింది. రెండు వేరియంట్లు ఇప్పుడు ఎక్కువ ధరలో ఉన్నాయి.

Also Read: వైరల్ వీడియో స్కామ్‌తో కొత్త సైబర్ ఫ్రాడ్.. ఒక్క క్లిక్‌తో మీ ఫోన్ హ్యాక్..

శాంసంగ్ గెలాక్సీ F17 5G కొత్త ధరలు

Advertisement

బడ్జెట్ యూజర్లకు ప్రత్యేకమైన ఫోన్ గెలాక్సీ F17 5G. ఈ మోడల్‌లో ఎక్కువ వేరియంట్లు ఉన్నాయి. అన్ని ధరలు పెరిగాయి.
4GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ పెరిగిన ధర రూ.16,499. ఇంతకుముందు ధర రూ.15,499 ఉండేది.అంటే రూ.1,000 పెరిగింది.
6GB RAM + 128GB వేరియంట్ పెరిగిన ధర రూ.17,999. అయింది. ఇంతకుముందు ధర రూ.16,999 ఉండేది. రూ.1,000 పెరుగుదల ఉంది.
8GB RAM + 128GB టాప్ వేరియంట్ ఇప్పుడు రూ.19,999 అయింది. ఇంతకుముందు ధర రూ.18,499 ఉండేది. రూ.1,500 పెరిగింది.
ఈ ఫోన్ కొనడానికి బడ్జెట్ యూజర్లు ఇప్పుడు కాస్త ఎక్కువ ఖర్చు చేయాలి.

ఈ మోడల్స్ అన్నీ మిడ్ రేంజ్‌లో మంచి ఫీచర్స్ ఇస్తున్నాయి. ఈ ధర పెంపు మిడ్-రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లను ప్రభావితం చేసింది. ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునేవారికి ఈ ధర పెంపు వల్ల ఇప్పుడు కాస్త ఇబ్బంది తగ్గదు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×