E-Paper
Advertisement

ఆయిల్‌ మరకలు,పప్పు పొంగుళ్లు.. వేటినైనా తట్టుకునే టాప్ క్లాస్ గ్యాస్ స్టౌవ్స్!

ఆయిల్‌ మరకలు,పప్పు పొంగుళ్లు.. వేటినైనా తట్టుకునే టాప్ క్లాస్ గ్యాస్ స్టౌవ్స్!
Advertisement

Best gas stoves for Indian cooking: ఇండియన్ వంటల స్టైలే వేరు. ఘాటైన తాలింపులు, మసాలాల వేపుళ్లు, ప్రెజర్ కుక్కర్ విజిల్స్, పెద్ద పెద్ద గిన్నెల్లో వండే బిర్యానీలు.. ఇలా మన కిచెన్‌లో ప్రతి రోజూ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇంతటి హెవీ కుకింగ్‌ను తట్టుకోవాలంటే.. గ్యాస్ స్టౌవ్ మామూలుగా ఉంటే సరిపోదు. రఫ్ అండ్ టఫ్‌గా ఉండాలి. అందుకే.. కేవలం లుక్స్ మాత్రమే కాదు.. రోజువారీ ఇండియన్ వంటల లోడ్‌ను చాలా ఈజీగా, సేఫ్‌గా హ్యాండిల్ చేయగల బెస్ట్ గ్యాస్ స్టౌవ్స్ ఎలా ఉండాలో.. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మన వంటలకి ‘బ్రాస్ బర్నర్స్’ఎందుకు మస్ట్?

Advertisement

గ్యాస్ స్టౌవ్ కొనేటప్పుడు అందరూ చూసేది బర్నర్స్ గురించే. మార్కెట్లో అల్యూమినియం బేస్ తక్కువ ధరకే దొరికినప్పటికీ, మన వంటలకి మాత్రం ‘ఫోర్జ్డ్ బ్రాస్’బర్నర్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి ఎక్కువ వేడిని తట్టుకుంటాయి. అంతే కాకుండా తుప్పు పట్టవు, గ్యాస్‌ను సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దీని వల్ల వంట త్వరగా అవ్వడమే కాదు. గ్యాస్ కూడా బాగా ఆదా అవుతుంది. పైగా పెద్ద గిన్నెలు పెట్టి గంటల తరబడి వండినా ఇవి అస్సలు పాడవవు.

గ్లాస్ టాప్ వర్సెస్ స్టెయిన్‌లెస్ స్టీల్.. ఏది బెటర్?
ఈ రోజుల్లో మోడ్రన్ కిచెన్ లుక్ కోసం చాలామంది గ్లాస్ టాప్ గ్యాస్ స్టౌవ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే.. “గ్లాస్ టాప్స్ మన వంటల వేడికి పగిలిపోతాయా?” అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.

Advertisement

టఫెన్డ్ గ్లాస్ : ఇప్పుడు వచ్చే బ్రాండెడ్ స్టౌవ్స్‌లో హై-క్వాలిటీ టఫెన్డ్ గ్లాస్ వాడుతున్నారు. ఇవి స్క్రాచ్-రెసిస్టెంట్ మరియు హెవీ లోడ్‌ను తట్టుకోగలవు. కిచెన్‌కి క్లాసీ లుక్ ఇవ్వడమే కాదు,వంట అయ్యాక ఒక్క క్లాత్‌తో తుడిస్తే క్లీన్ అయిపోతాయి.

స్టెయిన్‌లెస్ స్టీల్: ఎప్పటికీ ఎవర్గ్రీన్ ఆప్షన్. క్లీనింగ్ కొంచెం కష్టమైనా, చాలా రోజులు పాడవకుండా ఉంటాయి. సాంప్రదాయ వంటల స్టైల్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్.

స్పేసింగ్, డిజైన్ చాలా ముఖ్యం బాస్:
మనవాళ్లు ఒకేసారి అన్నం, కూర, సాంబార్.. ఇలా అన్నీ కలిపి వండేస్తుంటారు. అందుకే.. 3 లేదా 4 బర్నర్ల స్టౌవ్ కొనేటప్పుడు వాటి మధ్య స్పేస్ (గ్యాప్) కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. పక్కపక్కనే పెద్ద గిన్నెలు, కడాయిలు పెట్టినప్పుడు ఒకదానికొకటి తగలకుండా ఉండే వైడ్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

స్మార్ట్ అండ్ సేఫ్ ఫీచర్స్:
1.ఇప్పుడు వస్తున్న గ్యాస్ స్టౌవ్స్ కేవలం మంటను ఇవ్వడమే కాదు.. బోలెడన్ని సేఫ్టీ ఫీచర్స్ తో వస్తున్నాయి.

2. ఆటో ఇగ్నిషన్ : లైటర్ లేదా అగ్గిపెట్టెలతో పని లేకుండా.. నాబ్ తిప్పగానే స్టౌవ్ వెలిగిపోతుంది.

Also Read: మోడ్రన్ కిచెన్స్‌లో ‘బెస్పోక్’ హవా.. లగ్జరీకి సరికొత్త కేరాఫ్ అడ్రస్!

3. ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్ పాలు లేదా పప్పు పొంగి మంట ఆరిపోతే.. ఆటోమేటిక్‌గా గ్యాస్ సప్లై ఆగిపోయే స్మార్ట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది మన కిచెన్‌కు పెను ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది.

ఈ రోజుల్లో కస్టమర్లు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, క్వాలిటీ , ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే  అప్లయెన్సెస్ కోసమే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. రోజువారీ మన ఇండియన్ కుకింగ్ తట్టుకుని, ఈజీగా క్లీన్ చేసుకునే అవకాశం ఉన్న గ్యాస్ స్టౌవ్‌ను ఎంచుకోవడమే స్మార్ట్ కిచెన్ పాలసీ. ఒక మంచి బ్రాండెడ్, వారంటీ ఉన్న గ్యాస్ స్టౌవ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ కిచెన్ పని మరింత ఈజీ అవ్వడం గ్యారెంటీ.

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×