E-Paper
Advertisement

Kawasaki Discount Offer: కవాసకి క్రేజీ ఆఫర్, ఆ బైక్ మీద ఏకంగా రూ. 22,000 తగ్గింపు!

Kawasaki Discount Offer: కవాసకి క్రేజీ ఆఫర్, ఆ బైక్ మీద ఏకంగా రూ. 22,000 తగ్గింపు!
Advertisement

Kawasaki Ninja 650 Discount Offer: జపాన్‌కు చెందిన ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ కవాసకీ మార్చి 2026కు సంబంధించి క్రేజీ డిస్కౌంట్ ను ప్రకటించింది. తన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ కవాసకీ నింజా 650పై చక్కటి డిస్కౌంట్ ఆఫర్‌ ను ప్రకటించింది.  ఇందుకు సంబంధించి కంపెనీ తాజాగా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం MY25 నింజా 650 మోడల్‌ పై ఏకంగా రూ.22,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

ప్రస్తుతం నిజంగా 650 ధర ఎంత అంటే?

సాధారణంగా కవాసకీ నింజా 650 ఎక్స్ షో రూమ్ ధర రూ.7,91,000. తాజాగా డిస్కౌంట్ నేపథ్యంలో ఈ బైక్ ధర రూ.7,69,000కి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రీమియం స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆలోచిస్తున్న రైడర్లకు ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ తగ్గింపు ధరను బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు రైడింగ్ గేర్, హెల్మెట్, జాకెట్ లాంటి సేఫ్టీ యాక్సెసరీస్ కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు.

మెకానికల్ గా నో ఛేంజెస్!

Advertisement

కవాసకీ నింజా 650కి సంబంధించి డిస్కౌంట్ మినహా, బైక్‌ లో ఎలాంటి కాస్మెటిక్, మెకానికల్ మార్పులు చేయలేదు. అంటే, ప్రస్తుతం అందిస్తున్న మోడల్ గతంలో ఉన్న స్పెసిఫికేషన్లతోనే వస్తుంది. MY25 నింజా 650  లైమ్ గ్రీన్, ఎబోనీ, పెర్ల్ బ్లిజార్డ్ వైట్ కలర్ స్కీమ్‌ లో అందుబాటులో ఉంది.

కవాసకీ నింజా 650 ఇంజిన్ గురించి..

కవాసకీ నింజా 650కి ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 649cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,000rpm దగ్గర 67bhp పవర్, 6,700rpm దగ్గర 64Nm టార్క్ ను అందిస్తుంది. స్పోర్టీ పని తీరు, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Advertisement

Read Also: మారుతి To టాటా.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బెస్ట్ పెట్రోల్ కార్లు ఇవే!

ఇంజిన్ విషయంలో కాస్త జాగ్రత్త

కవాసకీ నింజా 650 కొనుగోలు చేసే వినియోగదారులు ఓ కీలక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ మోడల్ ఇంజిన్ E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేదు. అందువల్ల E20 పెట్రోల్ వాడేటప్పుడు రైడర్లు ఇంజిన్ పనితీరును, దీర్ఘకాలిక హెల్త గురించి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల విడుదలైన MY26 నింజా 650 మోడల్‌ లో మాత్రం ఈ E20 అనుకూలత సమస్యను కంపెనీ సాల్వ్ చేసింది. ఇక ఈ బైక్ కు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, బుకింగ్, డెలివరీ సమాచారం కోసం వినియోగదారులు తమ సమీప కవాసకి డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిదని కంపెనీ వెల్లడించింది.

Read Also: టాటా పంచ్ ఈవీని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×