E-Paper
Advertisement

Lokesh Nara: స్కూల్ భోజనంపై విద్యార్థుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్

Lokesh Nara: స్కూల్ భోజనంపై విద్యార్థుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేష్
Advertisement

Lokesh Nara: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో భోజన నాణ్యత, ఆహార కొరత అంశాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం తారక రామానగర్ ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేదంటూ విద్యార్థులు ఆహారాన్ని డస్ట్‌బిన్‌లో పడేసిన ఉదంతం కలకలం రేపింది. అన్నం సరిగా ఉడకలేదని, పులిహోరలో ఉప్పు లేదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఈ ఘటనపై మంత్రి లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. భోజన నాణ్యతపై ఫిర్యాదు అందగానే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా భోజన ఏజెన్సీని మార్చడంతో పాటు హెడ్ మాస్టర్‌పై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలల్లో పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ‘లీప్’ (LEAP) యాప్‌ను వినియోగిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణమే ఫిర్యాదు చేసేలా వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

మరోవైపు అనకాపల్లి జిల్లా చీడికాడలోని బీసీ హాస్టల్‌లో ఆహార కొరత ఏర్పడటంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లోని తన సోదరీమణులకు పౌష్టికాహారం, నాణ్యమైన భోజనం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు జరుగుతున్న ఇబ్బందులకు చింతిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచుతామన్నారు.

భోజన పథకంలో అవకతవకలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచుతామని మంత్రి వివరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా భోజనం నాణ్యత లోపిస్తే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే క్రమంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆకలితో ఉండటం లేదా నాణ్యత లేని భోజనం తినడం వంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ల స్థాయిలోనే పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. బాధ్యతాయుతమైన విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులందరికీ నాణ్యమైన సంరక్షణ అందేలా చూస్తామని పునరుద్ఘాటించారు.

Advertisement

Read Also:  గ్యాస్ కష్టాలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. ఉత్తమ్ కుమార్ హైలెవెల్ మీటింగ్

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×