E-Paper
Advertisement

Kawasaki Discount: కవాసకి క్రేజీ డిస్కౌంట్, ఆ బైక్ పై ఏకంగా రూ. 20 వేలు తగ్గింపు!

Kawasaki Discount: కవాసకి క్రేజీ డిస్కౌంట్, ఆ బైక్ పై ఏకంగా రూ. 20 వేలు తగ్గింపు!
Advertisement

Kawasaki Versys-X 300 Offer: కవాసకి వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. క్రేజీ బైక్స్ మీద తగ్గింపు ఆఫర్ తో పాటు ఫ్రీ యాక్సెసరీస్ కూడా అందిస్తుంది. అందులో భాగంగానే MY26 వెర్సిస్ ఎక్స్ 300పై భారీ తగ్గింపులు అందిస్తోంది. కొత్తగా ఈ బైక్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 20,000 డిస్కౌంట్ ప్రకటించింది. అదే సమయంలో రూ. 46,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. మార్చి చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆఫర్‌ను మొదటగా జనవరి 2026లో MY25,  MY26 మోడల్స్ రెండింటికీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఫిబ్రవరి వరకు పొడిగించింది. ఇప్పుడు దీనిని మార్చి వరకు కొనసాగించారు. అయితే, ఈసారి కేవలం MY26 వెర్సిస్ ఎక్స్ 300 పరిమితం చేసింది.

తగ్గింపు తర్వాత వెర్సిస్-ఎక్స్  ధర ఎంత అంటే?

వెర్సిస్-ఎక్స్ బైక్ మీద తగ్గింపుల తర్వాత రూ. 3.29 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధర పలుకుతోంది. దీనికి అదనంగా, వినియోగదారులు రూ. 22,940 విలువైన సెంటర్ స్టాండ్‌ ను ఎంచుకోవచ్చు. 34 లీటర్ల సామర్థ్యం గల ప్యానీర్లు లేదంటే రూ. 45,880 విలువైన హార్డ్ ప్యానీర్లు పొందవచ్చు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు మరిన్ని వివరాల కోసం తమ సమీపంలోని కవాసకి డీలర్‌షిప్‌ ను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

MY26 వెర్సిస్-X 300 గురించి..

Advertisement

ప్రస్తుతం, MY26 వెర్సిస్-X 300 ఒకే రంగులో అందుబాటులో ఉంది. క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ లో ఉంది.  కొత్త ఆఫర్‌లు మినహా, వెర్సిస్-X 300 మెకానికల్‌గా ఎటువంటి మార్పులు లేవు. ఈ బైక్ 296cc, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, E20 కంప్లైంట్ ఇంజన్‌ తో పని చేస్తుంది.  ఇది 38.8bhp పవర్, 26Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also: వెహికల్ కలర్ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుందా? కచ్చితంగా ఈ విషయం తెలియాల్సిందే!

Advertisement

ఈ మోటార్‌ సైకిల్ టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్‌ పై సస్పెండ్ చేయబడింది. ఇది ముందు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల స్పోక్ వీల్ సెటప్‌ పై నడుస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు 290mm, వెనుక 220mm పెటల్ డిస్క్ సెటప్ ను కలిగి ఉంటుంది.

Read Also:  ఓలా To ఏథర్.. ఏప్రిల్ లాంచ్ కానున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×