E-Paper
Advertisement

Kia Seltos: అమ్మకాల్లో దుమ్మురేపిన కియా సెల్టోస్, ఏకంగా 6 లక్షల మార్క్ క్రాస్!

Kia Seltos: అమ్మకాల్లో దుమ్మురేపిన కియా సెల్టోస్, ఏకంగా 6 లక్షల మార్క్ క్రాస్!

Kia Seltos Hits 6 Lakh Sales: భారతీయ మార్కెట్ లో కియా కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సెల్టోస్ మోడల్స్  అమ్మకాల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఈ కారు 6 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్ ను దాటేసింది. 2019 ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టగా, తాజాగా ఈ ఘనతను సాధించినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ మోడల్ కు చెందిన అన్ని వేరియంట్లకు వినియోగదారుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఈ మిడ్ సైజ్ SUV విభాగంలో అత్యంత స్థిరమైన అమ్మకాలు సాధిస్తోంది. ఈ మోడల్ సెకెండ్ జెనరేషన్ జనవరి 2, 2026న లాంచ్ అయ్యింది. దీని ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) ఉన్నాయి.  హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, VW టైగన్, MG ఆస్టర్ తో ఈ కారు గట్టిగా పోటీ పడుతోంది.

సంతోషం వ్యక్తం చేసిన కియా సంస్థ

దేశీ మార్కెట్ లో సెల్టోస్ 6 లక్షల అమ్మకాలు పూర్తి చేసుకోవడం పట్ల కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్‌ హాక్ పార్క్ సంతోషం వ్యక్తం చేశారు. 6 లక్షల అమ్మకాలను దాటడానికి ఈ మోడల్ డిజైన్, భద్రత, సాంకేతికత, పనితీరు కారణం అన్నారు. సెల్టోస్ ప్రారంభలో లేని ఫీచర్లు, కాన్ఫిగరేషన్లను అందించడం ద్వారా మిడ్ SUV విభాగంలో అంచనాలకు అనుగుణంగా రాణిస్తుందన్నారు. భద్రత, సాంకేతికత ఈ కారు సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ మోడల్  ADASతో పాటు మెరుగైన కనెక్టివిటీ పరిష్కారాలు, విస్తృత భద్రతా ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

కియా సెల్టోస్ ఫీచర్లు 

కియా సెల్టోస్ 4,460 mm పొడవు, 1,830 mm వెడల్పు, 2,690 mm పొడవైన వీల్‌ బేస్‌తో, కొత్త సెల్టోస్ ఈ విభాగంలో అత్యంత ఫీచర్ లోడెడ్ SUVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది డ్యూయల్ 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్లను, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 10 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటును అందిస్తుంది.

భద్రత కోసం 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (ABS), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), మరిన్నింటితో సహా బలమైన 24 స్టాండర్డ్ సేఫ్టీ ప్యాక్‌తో పాటు 21 అటానమస్ ఫీచర్లతో లెవల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్లను కలిగి ఉంటుంది.

ఇంజిన్ ఎంపికలు

ఈ SUV మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. స్మార్ట్‌ స్ట్రీమ్ G1.5 పెట్రోల్, స్మార్ట్‌ స్ట్రీమ్ G1.5 T-GDI పెట్రోల్, మరియు 1.5L CRDi VGT యూనిట్. ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో 6MT, 6iMT, IVT, 7DCT, 6AT ఉన్నాయి.

Read Also:  దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు 1993లోనే వచ్చింది, కానీ సక్సెస్ కాలేకపోయింది, ఎందుకంటే?

Related News

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

Big Stories

×