E-Paper
Advertisement

526 కి.మీ రేంజ్‌తో సైరోస్ ఈవీ సంచలనం.. టాటా, మహీంద్రాకు కియా సవాల్!

526 కి.మీ రేంజ్‌తో సైరోస్ ఈవీ సంచలనం.. టాటా, మహీంద్రాకు కియా సవాల్!
Advertisement

Kia Syros EV Launched: కియా ఇండియా కొత్త సైరోస్ ఎలక్ట్రిక్ వెహికల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షలు. ప్రస్తుతం భారత్ లో కియా నుంచి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేరెన్స్ క్లావిస్ EV తర్వాత కియా నుంచి వచ్చిన రెండో మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ మోడల్ కూడా ఇదే కావడం విశేషం. కియా ఈ కారును బ్యాటరీ యాస్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ ద్వారా కూడా అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా కారు ప్రారంభ ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే, బ్యాటరీ వినియోగానికి ప్రతి కిలోమీటర్‌కు అదనంగా రూ.3.30 చెల్లించాల్సి ఉంటుంది.

సింగిల్ చార్జ్ తో 526 కి.మీ రేంజ్

సైరోస్ EVలో 42kWh, 51.4kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. చిన్న బ్యాటరీతో 443 కిలోమీటర్ల రేంజ్, పెద్ద బ్యాటరీతో 526 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని కియా వెల్లడించింది. ఈ సెగ్మెంట్‌ లో ఇది అత్యధిక రేంజ్ అందించే మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ లో 171 హెచ్‌పీ పవర్, 255Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ ను అందించారు. చిన్న బ్యాటరీ వేరియంట్‌ లో 135 హెచ్‌పీ పవర్ లభిస్తుంది. టాప్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 8.1 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. 7.4Kw, 10.8kW AC ఛార్జర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 6 గంటలు, పెద్ద బ్యాటరీకి 7 గంటల 15 నిమిషాలు పడుతుంది. ఇక 100kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే, 51.4kWh బ్యాటరీని 39 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ పరంగా చూస్తే, పెట్రోల్ సైరోస్‌ తో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఏర్పాటు చేశారు. మిగతా లైటింగ్, అల్లాయ్ వీల్స్, బాడీ డిజైన్ దాదాపు అలాగే ఉన్నాయి. ఈ కారును పలు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇంటీరియర్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ ప్లేతో కూడిన ట్రినిటీ పనోరమిక్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌ లెస్ ఛార్జర్, 8-స్పీకర్ల హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ SUVలో ప్రత్యేకంగా వెంటిలేటెడ్, స్లైడింగ్, రిక్లైనింగ్ రియర్ సీట్లు ఇచ్చారు. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ముందు సీట్లు కూడా పవర్ అడ్జస్టబుల్, వెంటిలేటెడ్‌గా ఉన్నాయి. అదనంగా పనోరమిక్ సన్‌ రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ కెమెరా డ్యాష్‌క్యామ్, 16 లీటర్ల ఫ్రంక్ కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రతకు సంబంధించి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,  హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 ADAS లాంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇందులో అందించింది.  ఎక్కువ రేంజ్, అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు, బలమైన భద్రతా వ్యవస్థతో కియా సైరోస్ EV భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో టాటా, మహీంద్రాకు గట్టి పోటీ ఇచ్చే మోడల్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Read Also: 158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×