E-Paper
Advertisement

జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!

జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!
Advertisement

Jio Freedom Pack: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. జియో హోమ్ (ఫైబర్, ఎయిర్‌ఫైబర్) కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రూ. 10,000 ‘ఫ్రీడమ్ ప్యాక్’ అందిస్తోంది. వాస్తవానికి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాదే జియో ఈ ఫ్రీడమ్ ప్యాక్ ను ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్ సైట్, మైజియో యాప్ లలో అందుబాటులో ఉన్నట్లు టెలికాం వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫ్రీడమ్ ప్యాక్ కు సంబంధించిన విశేషాలపై మరోమారు లుక్కేద్దాం.

15 నెలల వ్యాలిడిటీ

జియో హోమ్ పోర్ట్‌ఫోలియోలో ఏ ప్లాన్ కు లేని విధంగా ఈ ఫ్రీడమ్ ప్యాక్ లో ఏకంగా 15 నెలల వ్యాలిడిటీని అందించారు. సాధారణంగా బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ గరిష్టంగా 12 నెలల కాలపరిమితో వస్తాయి. కానీ ఈ ప్యాక్ ద్వారా మరో మూడు నెలల అదనపు సేవలను ఉచితంగా పొందే ఛాన్స్ జియో కల్పిస్తోంది.

100 Mbps వేగంతో ఇంటర్నెట్

Advertisement

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 100 Mbps వేగంతో అపరిమిత డేటాను పొందొచ్చు. అప్‌లోడ్, డౌన్‌లోడ్ రెండింటికీ ఇదే స్పీడ్ వర్తిస్తుందని జియో వర్గాలు తెలిపాయి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఆన్‌లైన్ తరగతులు వినే విద్యార్థులకు, ల్యాగ్ లేని గేమింగ్ కోరుకునే వారికి ఈ ఫ్రీడమ్ ప్యాక్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దీంతోపాటు ఎలాంటి పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్ సౌకర్యం యూజర్లు పొందొచ్చు.

1000 పైగా టీవీ ఛానెళ్లు

ఈ ప్యాక్ తీసుకునే కస్టమర్లకు ఉచితంగా 4K సెటాప్ బాక్స్ ను జియో అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు ప్రత్యేకంగా డిటీహెచ్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే జియో టీవీ యాప్ ద్వారా 1000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించవచ్చు. అంతేకాకుండా టీవీలోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందించే ‘జియో పీసీ’ సౌకర్యాన్ని కూడా ఈ ప్లాన్ ద్వారా పొందే వీలుంది.

Advertisement

Also Read: బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

12 ఓటీటీల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ చూసేవారి కోసం ఇందులో 12 ఓటీటీలకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను జియో ఆఫర్ చేస్తోంది. జియో హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ+, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్, ఈరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షెమరూమీ, ఈటీవీ విన్ వంటి 12 ప్రముఖ ఓటీటీ యాప్‌ల కంటెంట్ ఫ్రీగా చూసే వెసులుబాటును ఈ ఫ్రీడమ్ ప్యాక్ అందిస్తోంది.

Also Read: జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×