E-Paper
Advertisement

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!
Advertisement

Bigg Boss 10 First Contestant: బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు సీజన్ 10 కి కౌంట్ డౌన్ మొదలయ్యింది. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ 10వ సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. 10వ సీజన్ కావడంతో దశావతారం అనే కాన్సెప్ట్ తో చాలా కొత్తగా చూపించబోతున్నాం అంటూ ఇప్పటికే మేకర్స్ పలు ప్రచార చిత్రాల ద్వారా చెప్పుకొచ్చారు. దీంతో హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెడతారు అనే విషయంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 10 మంది సెలబ్రిటీలు, 6 మంది అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్స్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు.

టికెట్ టు బిగ్ బాస్ అందుకున్న కామనర్..

మరి హౌస్ లోకి అడుగుపెట్టే ఆ ఆరుగురు కామనర్స్ ఎవరు? అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ కాగా.. తాజాగా ఒక కంటెస్టెంట్ ఫైనల్ అయింది . అగ్ని పరీక్ష 2 జడ్జెస్ బిందు మాధవి (Bindhu madhavi), నవదీప్ (Navdeep), అభిజిత్(Abijeeth) ఆమెకు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టడానికి ఎంట్రీ టికెట్ ఇచ్చేశారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 10 లోకి అడుగుపెట్టే తొలి కామనర్ ఫిక్స్ అయిపోయారు . అయితే ఆమె ఎవరో కాదు జానపద సింగర్ ఝాన్సీ (Jhansi).

తొలి కామనర్ గా సింగర్ ఝాన్సీ..

Advertisement

అగ్ని పరీక్ష సీజన్ 2లో తనదైన ఆట, మాట తీరుతో.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా టాస్కుల్లో దూకుడుగా ఆడుతూ జడ్జెస్ ను మెప్పించింది. ఎట్టకేలకు అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో టికెట్ టు బిగ్ బాస్ ను సొంతం చేసుకుంది. నిజానికి ఈ టికెట్ టు బిగ్ బాస్ గెలిచినవారికి నేరుగా హౌస్ లోకి ఎంట్రీ లభిస్తుంది . ఈ పోటీలలో ఝాన్సీ విజయం అందుకుంది. ఇక దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో అడుగు పెట్టే తొలి కంటెస్టెంట్ గా ఝాన్సీ నిలిచింది.

ALSO READ: కోర్ట్ హీరో రోషన్ ‘తెల్ల కాగితం’ టీజర్ రిలీజ్!

కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్..

Advertisement

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్లడానికి కామనర్ కేటగిరీలో ఝాన్సీ ఎంపిక అవ్వడంతో నవదీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. టికెట్ టు బిగ్ బాస్ అందుకున్న తర్వాత ఝాన్సీ మాట్లాడుతూ..” ఆరోజు నవదీప్ అన్న చెప్పారు.. ఇలాంటి కళలు హౌస్ లోకి వెళ్ళాలి.. కనపడాలి అని.. సో కచ్చితంగా ఇప్పుడు కనబడుతుంది. డైరెక్ట్ గా టికెట్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను. ఆరోజు అభిజిత్ అన్న నాకు రెడ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎల్లో ఇప్పుడు గ్రీన్ తీసుకొని హౌస్ లోకి వెళుతున్నాను అంటూ ఝాన్సీ చెబుతుండగానే అభిజిత్.. మీ ఆట చూడాలని నేను రెడ్ ఇచ్చాను. మిమ్మల్ని ఎవరు ఆపేటోళ్లు లేరమ్మ.. మీలాంటి వాళ్ళ హౌస్ లోకి వెళ్ళాలి అంటూ చెప్పారు. అయితే ఇటు ఝాన్సీ మాట్లాడుతుండగానే అటు నవదీప్ కి కన్నీళ్లు ఆగలేదు. ఎప్పుడు కాంట్రవర్సీ మాటలతో డేర్ అండ్ డాషింగ్ గా ఉండే నవదీప్ ఇలా తొలిసారి స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అభిమానులు మాత్రం ఇది ఆనంద భాష్పాలు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం .మొత్తానికైతే నవదీప్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఝాన్సీ ఎమోషనల్ కామెంట్స్..

ఝాన్సీ తనకు ఈ అవకాశం లభించడంతో.. తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్ బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నాను. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో , మన పాటతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. ఎప్పటికీ ఇలాగే మీ ప్రేమ, సపోర్టు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఝాన్సీ కోరింది.

 

?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×