E-Paper
Advertisement

Kawasaki Discount: కవాసకి నింజా 300పై రూ.28,000 తగ్గింపు, ఆఫర్ జస్ట్ నాలుగు రోజులు మాత్రమే!

Kawasaki Discount: కవాసకి నింజా 300పై రూ.28,000 తగ్గింపు, ఆఫర్ జస్ట్ నాలుగు రోజులు మాత్రమే!
Advertisement

Kawasaki Ninja 300 Discount: యువతను అద్భుతంగా ఆకట్టుకునే సూపర్ డూపర్ బైక్స్ తీసుకురావడంలో కవాసకి ముందుంటుంది. రేసర్లకు అనుకూలంగా ఉండే పలు రకాల మోడల్స్ ఈ కంపెనీ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీకి చెందిన పలు సూపర్ బైక్స్ ను కొనుగోలు చేసేందుకు యంగ్ స్టర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. వారిని ఆసక్తిని మరింత పెంచేందుకు, కవాసకి తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ నింజా శ్రేణిపై డిస్కౌంట్లను ప్రకటించింది. నింజా 300 మోడల్ మీద రూ.28,000 తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత ఈబైక ధర రూ.2.89 లక్షలకు అందుబాటులో ఉంది. నింజా 300 దేశంలోనే అత్యంత సరసమైన ట్విన్ సిలిండర్ ఆఫర్‌గా మారింది. ఇప్పుడు, నింజా 300 దాని ప్రధాన పోటీదారు KTM RC 390తో పోలిస్తే రూ. 34,000 తక్కవ ధరకు లభిస్తుంది.

ఈ నెల 28 వరకే ఆఫర్!

ఇక కంపెనీ వినియోగదారులకు ఓ ట్విస్ట్ ఇచ్చింది. రూ. 28,000 తగ్గింపు అనేది MY2024 నింజా 300 మోటార్‌ సైకిళ్లపై మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అదే సమయంలో ఈ ఆఫర్ ఫిబ్రవరి 28, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

కవాసకి నింజా 300 స్పెసిఫికేషన్స్

Advertisement

కవాసకి నింజా 300  296 cc, లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్ పారలల్ ట్విన్, DOHC, 8 వాల్వ్స్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 11,000 rpm దగ్గర 39 PS పవర్ అందిస్తుంది. 10,000 rpm దగ్గర 26.1 Nm టార్క్ ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, అసిస్ట్,  స్లిప్పర్ క్లచ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. టాప్ స్పీడ్ సుమారు గంటకు 160 కి.మీ నుంచి 180 కి.మీ వరకు ఉంటుంది. 6 సెకెన్లలో ఈ బైక్ 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ తో 25 నుంచి 30 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్ వెయిట్ 179 కేజీలు ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు ఉంటుంది.

Read Also: టాటా సియెర్రా EV లాంచ్ డేట్ ఫిక్స్, మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Advertisement

అటు కవాసకి నింజా 300 ఫ్రంట్ సస్పెన్షన్ 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్ సస్పెన్షన్ బాటమ్ లింక్ యూని ట్రాక్ గ్యాస్ చార్జ్డ్ షాక్ ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ 290 mm పెటల్ డిస్క్ తో వస్తుంది. రియర్ బ్రేక్ 220 mm పెటల్ డిస్క్ ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABSను కలిగి ఉంటుంది. హెడ్‌ లైట్ డ్యూయల్ ప్రొజెక్టర్ ఉంటుంది. లార్జర్ సైజ్ విండ్‌ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. మూడు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, పెటల్ డిస్క్ బ్రేక్స్, అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ స్మూత్ ఇంజన్, గుడ్ హ్యాండ్లింగ్, హైవే క్రూజింగ్‌కు బెస్ట్. కానీ మోడర్న్ ఫీచర్స్ ముఖ్యంగా LED లైట్స్, TFT డిస్‌ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ లేవు.

Read Also:  ఎలక్ట్రిక్ కారు యజమానులకు అలర్ట్, ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×