E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఓ ఫ్యామిలీలో ముగ్గురు ఆత్మహత్య

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఓ ఫ్యామిలీలో ముగ్గురు ఆత్మహత్య
Advertisement

Hyderabad Crime: కారణాలు ఏంటో తెలీదు. ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం ఆ ఇంట్లో ఏం జరిగింది?

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో దారుణం

Advertisement

హైదరాబాద్ అంబర్‌పేట్‌ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మృతులు 55 ఏళ్ల రామ్ రాజ్, 50 ఏళ్ల మాధవి, 24 ఏళ్ల శశాంక్‌గా గుర్తించారు పోలీసులు. మంగళవారం ఉదయం రాజ్ కుటుంబసభ్యులు ఎంతసేపటికీ తలుపులు తీయలేదు.

దీంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. చివరకు కిటికీ తెరచి చూశారు. వారిని పదేపదే పేర్లు పెట్టి పిలిచారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికులు, పోలీసులు అక్కడికి వచ్చిన బలవతంగా తలుపులు ఓపెన్ చేశారు.

Advertisement

 ఓ ఫ్యామిలీలో ముగ్గురు ఆత్మహత్య, కారణాలపై పోలీసులు ఆరా

అప్పటికీ ఆ ముగ్గురు విగతజీవులుగా ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఈ కుటుంబానికి చెందిన బంధువులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలపై చుట్టుపక్కల వారి నుంచి ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

ఆత్మహత్యకు సంబంధించి సమాచారం కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మూడు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: బ్లూ డ్రమ్ హత్య కలకలం.. తండ్రిని చంపిన కొడుకు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×