E-Paper
Advertisement

Low Selling EV Scooters Jan 2026: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. కొనే నాథుడే లేడండీ బాబూ!

Low Selling EV Scooters Jan 2026: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. కొనే నాథుడే లేడండీ బాబూ!
Advertisement

గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో బాగా సత్తా చాటుతున్నాయి. పెట్రోల్ బైక్స్ కు సమానంగా ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే, 2026 జనవరిలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అనుకున్న స్థాయిలో అమ్మకాలు కొనసాగించలేకపోతున్నాయి. ముఖ్యంగా తక్కువ వేగం, తక్కువ బడ్జెట్, పట్టణ ప్రయాణాల కోసం రూపొందించిన బైక్స్ ను కొనుగోలుదారులు అంతగా ఇష్టపడటం లేదు. లైసెన్స్ లేని, ఎంట్రీ లెవల్ మోడళ్లు లో సేల్స్ లిస్టులో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో టాప్ బ్రాండ్స్ కు చెందిన మోడల్స్ కూడా ఉన్నాయి. ఓలా,    హీరో కంపెనీలకు చెందిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. ఈ స్కూటర్లు సాధారణంగా 250W మోటార్లతో అమర్చబడి ఉన్నాయి. తక్కువ రేంజ్ ప్రయాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

తక్కువ అమ్మకాలు కొనసాగిస్తున్న ఈవీ స్కూటర్లు  

⦿ ఓలా గిగ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర రూ. 39,999 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. కానీ,  మాస్ మార్కెట్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేదు. తక్కువ వేగం, తక్కువ రేంజ్ కారణంగా ఎక్కువ మంది ఇష్టపడటం లేదు.

Advertisement

⦿ యులు విన్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 55,555 నుండి ప్రారంభం అవుతుంది. తక్కువ వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది కూడా ఒకటి. తేలికైన, పర్యావరణ అనుకూల ఎంపిక అయినప్పటికీ పెద్దగా కొనుగోళ్లు లేవు.

⦿ హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ LX: పాపులర్ బ్రాండ్ కు చెందిన ఈ స్కూటర్ రూ. 59,640 నుంచి అందుబాటులో ఉంది. 85 కి.మీ పరిధితో 250W మోటారును కలిగి ఉంది. అయినా ఎక్కువగా కొనుగోళ్లు లేవు.

Advertisement

⦿ ఒకినావా R30: ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 61,998. ఒకే  ఛార్జ్‌ కి 60 కి.మీ సామర్థ్యంతో 250W మోటారును అందిస్తుంది. అయినా, అనుకున్న స్థాయిలో అమ్మకాలు లేవు.

⦿ కైనెటిక్ గ్రీన్ జింగ్: ఈ స్కూటర్ ధర రూ. 67,990 నుంచి ప్రారంభం అవుతుంది. 250W BLDC మోటార్ ద్వారా పవర్ ను పొందుతుంది.

⦿ ఒకినావా లైట్: ఈ స్కూటర్ ధర రూ. 69,093 నుండి ప్రారంభం అవుతుంది. సిటీ రైడర్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్కూటర్ అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం లేదు.

⦿ విడా VX2: ఈ స్కూటర్ రూ. 44,990 నుంచి అందుబాటులో ఉంది. తక్కువ ధర, బడ్జెట్ అనుకూలమైన ఎంపిక అయినా, రేంజ్, స్పీడ్ కారణంగా ఎక్కువగా కొనుగోళ్లు లేవు.

⦿ గ్రీన్ ఉడాన్: ఈ స్కూటర్ ధర కేవలం రూ. 24,499 నుంచి ప్రారంభమవుతుంది.  అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, కొనుగోళ్లు లేవు.

ఎందుకు వీటికి తక్కువ డిమాండ్ అంటే?    

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ వేగం, లైసెన్స్ అవసరం లేని మోడల్‌లు అత్యంత సరసమైన సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ దూరం, రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. కానీ, వీటిని వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడటం లేదు.

Read Also:  కవాసకి To కేటీఎం.. అమ్మకాల్లో సత్తా చాటని బైక్స్ ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×