The RajaSaab:ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే.. ఆ సినిమా కథను రూపొందించే రచయితను మొదలుకొని నిర్మించే నిర్మాత వరకు ప్రతి ఒక్కరూ లాభపడాలనే దిశగా అడుగులు వేస్తారు. అందుకు తగ్గట్టు ప్రేక్షకుడికి మంచి కంటెంట్ తో పాటు ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ ను కూడా కలిగించాలి. అప్పుడే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం కడతారు.. ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా వారి భవిష్యత్తుకు ప్రోత్సాహం కూడా అందిస్తారు. అయితే ఈ బాధ్యత సినిమాను రూపొందించే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది.
మరోవైపు కథను రూపొందించేటప్పుడే హీరో, హీరోయిన్లు కూడా ఆ దర్శకుడిపై, ఆ కథపై నమ్మకం పెట్టాలి.ముఖ్యంగా ఒక డైరెక్టర్ కథ చెప్పారు అంటే ఆ డైరెక్టర్ పైన ఉన్న నమ్మకంతోనే సినిమాలు చేసే హీరోలు కూడా లేకపోలేదు. అలా ఒక స్టార్ డైరెక్టర్ ను నమ్మి.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేసి బొక్క బోర్ల పడ్డారు ఒక స్టార్ హీరో.. చివరికి తనకున్న ఇమేజ్ కాస్త డామేజ్ అయిందని సదరు హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దెబ్బకు ఆయన మళ్లీ ఆ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశాలే లేవు అంటూ స్పష్టంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఆయన ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ). పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రతి ఒకటి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కథ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ప్రభాస్ కి పాన్ ఇండియా వైడ్ ఉన్న మార్కెట్ కారణంగా ఆ సినిమా కథ డిజాస్టర్ గా నిలిచినా..కలెక్షన్ల సునామీ కురిపిస్తారు అనే నమ్మకం అందరిలో బలంగా ఉండేది.
కానీ ఎప్పుడైతే భారీ అంచనాల మధ్య వింటేజ్ లుక్ లో ప్రభాస్ తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో ది రాజాసాబ్ అంటూ మూవీ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా థియేటర్లలో బొక్క బోర్ల పడింది. అందులోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కంటెంట్ బాగా లేకపోయినా ఏదోలాగా కలెక్షన్లు వసూలు చేసి లాభపడవచ్చని నిర్మాతలు గట్టిగానే అనుకున్నారు. కానీ సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఆ సెలవు రోజుల్లో బాగానే థియేటర్లలో ప్రదర్శించబడినా.. ఆ తర్వాత పూర్తిగా థియేటర్లు ఖాళీ అయ్యాయి. దీంతో నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు.
అయితే ఈ సినిమా వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం చేకూరింది అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రభాస్ ఇమేజ్ కి భారీగా డామేజ్ పడిందనే వార్తలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ కోసమే సినిమా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ప్రభాస్ ని అలా చూపిస్తాను. ఇలా చూపిస్తానని ప్రగల్బాలు పలికిన మారుతి ఎందుకు ఈ సినిమాలో ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా ఆయనను చూపించలేకపోయారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి కొంతమంది అభిమానులు కావాలనే పని గట్టుకొని మరీ ప్రభాస్ ఇమేజ్ కి డామేజ్ కలిగించారు అంటూ మారుతీపై మండిపడుతున్నారు.
ఇలాంటి సమయంలో నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి . ది రాజాసాబ్ ప్రాజెక్ట్ వల్ల లాభపడింది దర్శకుడు మారుతి, లైన్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ . ఆయన మాట్లాడుతూ భారీ బడ్జెట్ ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కేటాయించినప్పటికీ ..తక్కువ స్థాయి వీఎఫ్ఎక్స్ వాడారు. సినిమా బడ్జెట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ల పర్సనల్ పనులకు వాడుకొని క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి అధికారిక రుజువు లేకపోయినా కావాలనే కొంతమంది ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ALSO READ:Jabardasth Sujatha: సుజాత – రాకేష్ యూట్యూబ్ సంపాదన అన్ని కోట్లా.. మరి ఆ తిప్పలు ఎందుకు భయ్యా!
ఈ వార్తలు సంగతి కాస్త పక్కన పెడితే జనరల్ గా ఆలోచించినా సరే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు పెట్టింది. అదే రేంజిలో విఎఫ్ఎక్స్ ను ఉపయోగించి ఉండవచ్చు.. కానీ నాసిరకపు వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించడం సినిమాకు అతిపెద్ద మైనస్ గా మారింది. దీనితోడు ఈ సినిమాలో మొసలితో ప్రభాస్ పోరాడే సన్నివేశం కోసం ఏకంగా 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. పైగా ప్రభాస్ ఈ సన్నివేశం కోసం తన రెమ్యూనరేషన్ ని కూడా తగ్గించుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ప్రభాస్ ఈ సినిమా కోసం ఇంత చేసినప్పటికీ మారుతి ఆయనను సరిగా ఉపయోగించుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక భవిష్యత్తులో ప్రభాస్ మారుతితో మళ్ళీ సినిమా చేయరా అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా ఆయన అభిమానులు మాత్రం ప్రభాస్ మళ్లీ మారుతి వైపు కూడా చూడడు అంటూ గట్టిగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని మారుతీ డ్యామేజ్ చేశారనే కామెంట్లు మాత్రం స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి.