E-Paper
Advertisement

Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్

Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్
Advertisement

Medaram Jatara: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. వన దేవతలు సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరుకోవడంతో.. మేడారం జన సంద్రంలా మారింది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి గద్దెలపై కొలువు దీరిన అమ్మవార్లకు బంగారం(బెల్లం)తో మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50 లక్షల మందికి పైగా భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గత మూడు రోజులుగా 80 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

భారీగా ట్రాఫిక్ జామ్

భక్తులు భారీగా తరలిరావడంతో.. తాడ్వాయి- మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే రహదారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. శుక్రవారం పస్రా నుంచి తాడ్వాయి, మేడారం వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వేల సంఖ్యలో వాహనాలు రెండున్నర గంటల పాటు రోడ్లపై చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఇబ్బందులు సమస్య తప్పలేదు.

80 లక్షలకు పైగా భక్తులు

Advertisement

మేడారం మహాజాతర శనివారం సమ్మక్క వన ప్రవేశం ఘట్టంతో ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం సారలమ్మ ఆగమనంతో ప్రారంభమైన జాతరకు గత మూడు రోజుల్లో 80 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రాక పెద్ద సంఖ్యలో ఉంటుందని అంటున్నారు.

Also Read: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

నేటితో ముగియనున్న జాతర

Advertisement

మేడారం మహాజాతర జనవరి 28న ప్రారంభమై జనవరి 31తో ముగియనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్‌ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. 29న చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం నాడు నలుగురు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ నలుగురు తిరిగి వన ప్రవేశం చేయడంతో మేడారం మహా జాతర ముగుస్తుంది. భక్తులు తిరుగు ప్రయాణం పట్టడంతో.. భారీగా రద్దీ నెలకొంది. భక్తుల రద్దీతో ఆర్టీసీ మరిన్నీ బస్సులను మేడారం జాతరకు నడుపుతుంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×