E-Paper
Advertisement

తెలుగోడి అద్భుత సృష్టి ఈ మినీ కారు, ఇంతకీ మార్కెట్ లోకి ఎందుకు రాలేదు?

తెలుగోడి అద్భుత సృష్టి ఈ మినీ కారు, ఇంతకీ మార్కెట్ లోకి ఎందుకు రాలేదు?
Advertisement

Lush L1 Story: లష్ L1 గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. దీనిని హైదరాబాద్ కు చెందిన లష్ మోటార్స్ అనే సంస్థ తయారు చేసింది. సిటీలో ప్రయాణాలకు ఉపయోగపడేలా, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలనే లక్ష్యంతో దీనిని అభివృద్ధి  చేసింది. అయితే మంచి ఆలోచనగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, చివరకు పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి రాలేకపోయింది. ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇద్దరు కూర్చునేలా లష్ L1 డిజైన్

లష్ L1ను ఇద్దరు ప్రయాణీకులు కూర్చునేలా డిజైన్ చేశారు. ఇది పెద్ద కార్లలా కాకుండా, సిటీలో ట్రాఫిక్ మధ్య సులభంగా నడపగలిగేలా చిన్న సైజులో ఉండేలా ప్లాన్ చేశారు. దీనిని స్మార్ట్ అర్బన్ మొబిలిటీ వెహికల్‌ గా రూపొందించారు.రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, తక్కువ దూర ప్రయాణాల కోసం ఉపయోగపడే విధంగా రూపొందించారు.

ఒకే ఛార్జ్ తో 120 కి.మీ ప్రయాణం

Advertisement

ఈ వాహనంలో 1 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ సహాయంతో గంటకు సుమారు 55 కిలోమీటర్ల వేగం అందుకునే సామర్థ్యం ఉంది. సిటీలో సరిపడే వేగంగా చెప్పుకోవచ్చు. అలాగే, ఇందులో 48V 100Ah లిథియం బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

గంటన్నరలోనే ఫుల్ ఛార్జ్

ఛార్జింగ్ విషయంలో కూడా ఈ వాహనం ప్రత్యేకంగా కనిపించింది. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం ఒకటిన్నర గంటలోనే పూర్తి ఛార్జ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అదే ఇంట్లో సాధారణ ప్లగ్ ద్వారా ఛార్జ్ చేస్తే సుమారు 6 గంటలు పట్టేది. ఛార్జింగ్ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. ఇది రోజువారీ ఉపయోగానికి అనువుగా ఉండేలా రూపొందించారు.

గీతలు పడకుండా జెల్ కోటింగ్ పెయింట్

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, ఈ కారులో కాంపోజిట్ బాడీ వాడారు. దీనివల్ల బాడీపై గీతలు పడకుండా కాపాడుకోవచ్చు. జెల్ కోటింగ్ పెయింట్ కూడా వాడటం వల్ల దీని లుక్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు. ఇందులో కొన్ని ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. మొబైల్ యాప్ ద్వారా వాహనాన్ని కనెక్ట్ చేయడం, 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ లాంటి  ఫీచర్లు తీసుకొచ్చారు.

రూ. 2 లక్షల్లోనే అందించాలని భావించినా…

ఇంత మంచి ఆలోచన, సరసమైన ధర లక్ష్యంతో వచ్చినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఈ కారును రూ. 2 లక్షల లోపు అందించాలని కంపెనీ భావించింది. కానీ, నిధుల కొరత, పెట్టుబడుల లేమి కారణాలతో ఉత్పత్తి దశకు చేరుకోలేకపోయింది. చివరకు అభివృద్ధి దశలోనే ఆగిపోయింది. మొత్తానికి, లష్ L1 ఒక మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ, సరైన మద్దతు లేకపోవడంతో మార్కెట్‌ లో కనిపించలేదు. కానీ, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలనే ఆలోచనకు ఇదో బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.

Read Also: క్రూజ్ కంట్రోల్, హీటెడ్ సీట్‌.. కళ్లు చెదిరే జోంటెస్ స్కూటర్ లాంచ్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×