E-Paper
Advertisement

క్రూజ్ కంట్రోల్, హీటెడ్ సీట్‌.. కళ్లు చెదిరే జోంటెస్ స్కూటర్ లాంచ్!

క్రూజ్ కంట్రోల్, హీటెడ్ సీట్‌.. కళ్లు చెదిరే జోంటెస్ స్కూటర్ లాంచ్!
Advertisement

2026 Zontes ZT368-G ETC Revealed: చైనీస్ మోటార్ సైకిల్ కంపెనీ జోంటెస్ క్రూజీ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ZT368-G ETC స్కూటర్‌ ను కొన్ని కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఈ మార్పులు రైడింగ్ అనుభవాన్ని సులభతరం చేయడంతో పాటు రోజువారీ వినియోగంలో మరింత సౌకర్యం కలిగించనున్నాయి. టెక్నాలజీ పరంగా ఈ స్కూటర్‌ లో కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను తీసుకొచ్చింది.

ఆకట్టుకుంటున్న రైడ్ బై వైర్ సిస్టమ్   

ఈ మోడల్‌ లో కీ ఛేంజ్ రైడ్ బై వైర్ సిస్టమ్. దీని వల్ల థ్రాటిల్ రియాక్షన్ మరింత సాఫ్ట్‌ గా, కంట్రోల్‌లో ఉంటుంది. సిటీ   ట్రాఫిక్ మధ్య రైడ్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ ను కూడా జోడించారు. దీని ద్వారా హైవేపై  మరింత వేగంతో ప్రయాణించడం ఈజీ అవుతుంది.

Advertisement

ఇక హ్యాండిల్‌ బార్ స్విచ్‌ లను కొత్తగా డిజైన్ చేశారు. ఎడమ, కుడి వైపుల కంట్రోల్స్ లే అవుట్‌ను మార్చి మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. సాధారణంగా రైడర్ ఎక్కువగా ఉపయోగించే భాగం ఇదే కావడంతో, ఈ మార్పు మొత్తం రైడింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది.  చలికాలంలో, కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఉపయోగపడే విధంగా ఈ స్కూటర్‌లో హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీటు కూడా ఇచ్చారు. ఇవన్నీ నేరుగా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.  కలర్స్ విషయానికి వస్తే ఈ మోడల్ గ్రీన్, గ్రే, బ్లాక్, సాండ్ లాంటి ఆప్షన్లలో లభిస్తుంది.

ZT368-G ETC ఇంజిన్ గురించి..

ZT368-G ETCలో 368cc సామర్థ్యం కలిగిన లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది సుమారు 38 bhp పవర్, 40 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధన సామర్థ్యం లీటర్ కు సుమారు 28.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్థాయి స్కూటర్‌కు ఇది మంచి మైలేజ్‌గా చెప్పుకోవచ్చు.  సస్పెన్షన్ వ్యవస్థలో 41mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌ను ఉపయోగించారు. ఇది రీబౌండ్, కంప్రెషన్ సెట్టింగ్స్‌ ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇస్తుంది. దీంతో రోడ్ పరిస్థితులకు అనుగుణంగా రైడ్‌ ను సెట్ చేసుకోవచ్చు. సీట్ ఎత్తు 795mmగా ఉండటం వల్ల కొంతమందికి కొంచెం ఎత్తుగా అనిపించవచ్చు. అలాగే 197 కిలోల బరువు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

లాంగ్ రైడ్స్, అండ్వెంచర్ ప్రయాణాలకు..

Advertisement

ఈ స్కూటర్‌ ను లాంగ్ రైడ్స్, అడ్వెంచర్ ప్రయాణాల కోసం రూపొందించారు. అందువల్ల బరువు, పరిమాణం లాంటి విషయాల్లో  స్థిరత్వం, కంఫర్ట్ కోసం సహాయపడతాయి. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో అందుబాటులో లేకపోయినా, భవిష్యత్తులో కొన్ని మార్పులతో ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది.  2026 జోంటెస్ ZT368-G ETC స్కూటర్ టెక్నాలజీ, పవర్,  కంఫర్ట్ కలయికగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. సుదూర ప్రయాణాలు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ బిగ్ ప్లాన్స్.. ఈ ఏడాదిలో ఏకంగా 5 కొత్త బైక్‌లు వచ్చేస్తున్నాయ్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×