Regina Cassandra (image credit: Instagram)
రెజీనా కసాండ్రా.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. తెలుగు ,తమిళ్, కన్నడ భాషలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది.

Regina Cassandra (image credit: Instagram)
శివ మనసులో శృతి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది.. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట సినిమాలతో మరింత పాపులారిటీ అందుకుంది రెజీనా.

Regina Cassandra (image credit: Instagram)
ఇక తర్వాత కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం వంటి చిత్రాలు చేసిన రెజీనా తాజాగా ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.

Regina Cassandra (image credit: Instagram)
అందులో చురకత్తులు లాంటి చూపులతో కుర్ర కారు గుండెల్లో గుణపాలు దింపేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది . ప్రస్తుతం రెజీనా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Regina Cassandra (image credit: Instagram)

Regina Cassandra (image credit: Instagram)
రెజినా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నయనతార నటిస్తున్న మూకుత్తి అమ్మన్ 2లో నటిస్తోంది. అలాగే ఫ్లాష్ బ్యాక్, పార్టీ, బోర్డర్, కల్లాపార్ట్ వంటి తమిళ చిత్రాలలో నటిస్తున్న ఈమె.. మారీచిక అనే మలయాళం సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు సెక్షన్ 108 అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.