E-Paper
Advertisement

Mahindra Batman Edition: వామ్మో ఇదెక్కడి క్రేజ్ భయ్యా, 135 సెకెన్లలో కార్లన్నీ కొనేశారు!

Mahindra Batman Edition: వామ్మో ఇదెక్కడి క్రేజ్ భయ్యా, 135 సెకెన్లలో కార్లన్నీ కొనేశారు!
Advertisement

Mahindra Batman Edition EV Booking: మహీంద్రా కంపెనీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాటా తర్వాత అదే స్థాయిలో నమ్మకం ఉన్న కంపెనీ మహీంద్రా. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకురావడంలో ముందుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ ఆటో మోబైల్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ తో చేతులు కలిపింది. రెండు సంస్థలు కలిసి BE 6 బ్యాట్‌ మ్యాన్ స్పెషల్ ఎడిషన్ EVని లాంచ్ చేసింది. చక్కటి లుక్ తో పాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాట్‌ మ్యాన్‌ డార్క్ నైట్ స్టైల్, స్పెషల్ గ్రాఫిక్స్, అదిరిపోయే ఇంటీరియర్ తో చూడగానే ఆకట్టుకునేలా తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారుకు ఊహించని ఆదరణ లభించింది.

కేవలం 135 సెకెన్లలో 999 యూనిట్ల బుకింగ్

Advertisement

ఇక స్పెషల్ ఎడిషన్ కారు కేవలం, రెండు నిమిషాల్లోనే మొత్తం 999 యూనిట్లు బుక్ అయ్యాయి. ఇండియన్ ఆటో ఇండస్ట్రీలోనే అదురైన రికార్డును నెలకొల్పింది. మొదట్లో ఈ ప్రత్యేక ఎడిషన్ EVని కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాలని మహీంద్రా నిర్ణయించింది. కానీ, వినియోగదారుల నుంచి ఆసక్తి, డిమాండ్ కారణంగా 999 యూనిట్లను తయారు చేసింది. లాంచింగ్ తర్వాత బుకింగ విండోను ఓపెన్ చేసింది. అయితే, క్షణాల్లోనే ఈ కార్లన్నీ బుక్ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు.

సంతోషం వ్యక్తం చేసిన కంపెనీ

మహీంద్రా ఈవీ కార్ల పట్ల వినియోగదారులకు ఎంత నమ్మకం ఉందో మహీంద్రా BE 6 బ్యాట్‌ మ్యాన్ ఎడిషన్ EV విషయంలో మరోసారి రుజువు అయ్యిందిన కంపెనీ తెలిపింది.  ఇండియన్ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆదరణకు ఇదో నిదర్శనం అన్నది. తమ ఎలక్ట్రిక్ కార్లకు టెక్నాలజీతో పాటు సాంస్కృతిక హంగులు అద్దడం ద్వారా వినియోగదారుల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పింది.

సెప్టెంబర్ 20 నుంచి బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EV డెలివరీ

Advertisement

అటు స్పెషల్ BE 6 బ్యాట్‌ మ్యాన్ ఎడిషన్ EV డెలివరీలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఆ రోజు స్పెషల్ ఈవెంట్ నిర్వహించి డెలవరీలను ప్రారంభించనుంది. ఇక ఈ ప్రీమియం ఎడిషన్ EV  ధర రూ.27.79 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మూడు వేరియంట్లలో ఈ కారును అందిస్తుంది.

సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా..

ఇక బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EV పూర్తిగా డార్క్ కలర్ థీమ్‌తో అందుబాటులోకి రానుంది. బ్యాట్‌ మ్యాన్ యూనివర్స్ ను ప్రతిబింబించేలా చక్కటి స్టైలింగ్ ఎలిమెంట్స్, స్పెషల్ లైటింగ్,  ఆటోమోటివ్ డిజైన్‌ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. సాధారణ EVల మాదిరి కాకుండా, ఆటోమొబైల్ డిజైన్, ఎంటర్‌ టైన్‌మెంట్ కల్చర్‌ను మిక్స్ చేసి రూపొందించింది.  ఈ  బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌లో 79kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ 286 bhp శక్తిని, 380 Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. చూడ్డానికి స్పోర్టీ ఎలక్ట్రిక్ SUVగా కనిపిస్తుంది. ఒకే ఛార్జ్ మీద 500-600 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also:  టాటా మోటార్స్ గుడ్ న్యూస్, పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వచ్చేస్తోంది!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×