E-Paper
Advertisement

Mahindra BE.07: వచ్చే ఏడాది నెక్ట్స్ ఈవీ లాంచ్.. కీలక ప్రకటన చేసిన మహీంద్రా!

Mahindra BE.07: వచ్చే ఏడాది నెక్ట్స్ ఈవీ లాంచ్.. కీలక ప్రకటన చేసిన మహీంద్రా!
Advertisement

Mahindra Confirms Next EV Launch for 2027: మహీంద్రా కంపెనీ తన ఎలక్ట్రిక్ లైనప్ ను మరింత విస్తరిస్తుంది. ఈ ఏడాది BE 6 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయగా, వచ్చే ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కారు ఆగస్టు 2022లో ప్రదర్శించబడిన BE.07 కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ కానుంది. దీనిని కంపెనీ B07గా పిలుస్తున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న BE 6 కంటే BE.07 పెద్దదిగా ఉంటుంది. దాదాపు 4.6 మీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటికే ఉన్న EVల మాదిరిగానే అండర్‌ పిన్నింగ్స్, బ్యాటరీ ఎంపికలను కలిగి ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఈ కారు టాటా హారియర్ EV, విన్ ఫాస్ట్ VF7 లాంటి కార్లకు పోటీగా వస్తుందని భావిస్తున్నారు.

మహీంద్రా BE.07 ప్రత్యేకతలు ఏంటి?

BE.07 అనేది మహీంద్రా BE సిరీస్‌ లో రెండవ ఉత్పత్తి. XEV 9e, BE 6, XEV 9S తర్వాత బ్రాండ్ నాలుగో మోడల్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్షన్ మోడల్ వేరే పేరును కలిగి ఉండే అవకాశం ఉంది.  కానీ, ఈ కాన్సెప్ట్ BE 6 పైన ఉంటుందని చెప్పేలా సాంప్రదాయ SUV బాడీ స్టైల్‌ తో కూడిన 4.6-మీటర్ల 5-సీటర్‌ ను ప్రివ్యూ చేసింది. ఇది టాటా హారియర్ EV, విన్ ఫాస్ట్ VF7 లాంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా రూపొందుతోంది.  ఈ ప్రొడక్షన్ స్పెక్ BE.07 ఇప్పటికే ఉన్న EVల మాదిరిగానే  INGLO ప్లాట్‌ ఫారమ్ ద్వారా రూపొందుతుంది. బ్యాటరీ ప్యాక్ లు 60kWh, 80kWh మధ్య ఉంటాయని భావిస్తున్నారు.  మహీంద్రా  ప్రస్తుత EVల నుంచి చాలా డిజైన్ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వీటిలో ఎడ్జీ లైటింగ్ సిగ్నేచర్లు ఉన్నాయి. BE 6, XEV 9e కంటే కొంచెం సాంప్రదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంటీరియర్ కూడా ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్‌ తో ఉంటుందని అంచనా.

హై వాల్యూమ్ ప్రొడక్ట్ గా మహీంద్రా BE.07

Advertisement

ప్రస్తుత మూడు ప్రొడక్ట్స్ తో పోల్చితే BE.07 చాలా పెద్ద వ్యాల్యూమ్ గా ఉంటుందని భావిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CEO రాజేష్ జెజురికర్ వెల్లడించారు. మహీంద్రా ప్రస్తుతం నెలవారీ EV అమ్మకాల సగటున 4,000 యూనిట్లుగా ఉంది. ఈ సంవత్సరం దీనిని 6,000-7,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. అయితే, EV వృద్ధి రేటు కాస్త మందగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2026 మహీంద్రా కార్లు ఇవే!  

2025 చివరలో XEV 9S ను, జనవరిలో XUV 3XO EV ని విడుదల చేసిన మహీంద్రా, 2026కి మరో EVని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే, ఈ కంపెనీ రెండు ICE మోడళ్లను అప్ డేట్స్ తో తీసుకురాబోతోంది. అందులో ఒకటి స్కార్పియో N  ఫస్ట్ మిడ్ సైకిల్ ఫేస్‌ లిఫ్ట్ గా రాబోతోంది. థార్ శ్రేణిని అప్‌ డేట్ చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Read Also: పెట్రోల్ కార్లు ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. విన్ ఫాస్ట్ క్రేజీ ఆఫర్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×