E-Paper
Advertisement

Hyderabad: షాపుల్లో అల్లం పేస్ట్ కొంటున్నారా.? అయితే ముందు ఈ వీడియో చూడండి

Hyderabad: షాపుల్లో అల్లం పేస్ట్ కొంటున్నారా.? అయితే ముందు ఈ  వీడియో చూడండి
Advertisement

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్న కల్తీ వ్యవహారం.. ఒక్కోరోజు ఒక్కో దాని గురించి బయటకు వస్తున్న నిజాలు.. ముఖ్యంగా ప్రజలు రోజు క్రమం తప్పకుండా ఉపయోగించే వాటిలోనే ప్రాణాంతక విష వాయువులను కలుపుతున్నారు. కల్తీ పాలు, టీ పౌడర్.. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా.. ఇలా రోజుకొకటి బయటకు వస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉదంతం ప్రజలను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎం.ఎస్.మఖ్తా ప్రాంతంలోని ఒక రహస్య తయారీ కేంద్రంపై మెరుపు దాడులు నిర్వహించి, సుమారు 4,000 కేజీల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.

Advertisement

లాభమే ధ్యేయంగా సాగుతున్న ప్రాణసంకటం
అయితే హైదరాబాద్ వంటి మహానగరాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా పట్టుబడిన జసాని ఇల్యాన్ అనే 21 ఏళ్ల యువకుడు, JJ ఫుడ్స్ పేరుతో ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. గడువు ముగిసిన (Expired) FSSAI లైసెన్స్‌తో యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తూ, తక్కువ ధరకే వస్తుందని ఆశపడే హోటల్స్, కిరాణా షాపులకు దీనిని సరఫరా చేస్తున్నాడు.

కల్తీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు
సాధారణంగా ఈ కల్తీ పేస్ట్ తయారీలో కుళ్ళిపోయిన అల్లం, వెల్లుల్లితో పాటు బరువు పెరగడానికి టిటాన్ డయాక్సైడ్, గమ్ పౌడర్, ప్రమాదకరమైన సింథటిక్ రంగులను వాడుతుంటారు. నిల్వ ఉండటానికి అనుమతించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల ఇవి విషతుల్యంగా మారుతాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న 4000 కేజీల నిల్వలు మార్కెట్లోకి వెళ్లి ఉంటే, వేలమంది గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి బారిన పడే ప్రమాదం ఉండేది.

Advertisement

మార్కెట్లో ఇతర కల్తీల ఉధృతి
అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కాదు, ప్రస్తుతం సమాజంలో పాలు, నెయ్యి, కారం, పసుపు నుంచి చివరకు తాజా కూరగాయల వరకు అన్నీ కల్తీమయమే. మిర్చి పౌడర్‌లో ఇటుక పొడిని, పసుపులో లెడ్ క్రోమేట్‌ను, పాలలో యూరియాను కలపడం వంటి అమానవీయ పనులు నిత్యకృత్యమయ్యాయి. ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉండటంతో సామాన్యులు ఏది అసలు, ఏది నకిలీ అన్నది గుర్తించలేక మోసపోతున్నారు.

బాధ్యత ఎవరిది?
కేవలం లాభార్జనే ధ్యేయంగా పని చేసే ఇలాంటి ముఠాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచాలి. అయితే, వినియోగదారులుగా మనకు కూడా బాధ్యత ఉంది. తక్కువ ధరకి వస్తుందని నాణ్యత లేని వస్తువులను కొనడం మానుకోవాలి. FSSAI గుర్తింపు ఉన్నా, ప్యాకింగ్‌పై తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకునే సహజమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.

Also Read: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!

కఠిన చర్యలే పరిష్కారం
ఇలాంటి కల్తీ ముఠాలపై కేవలం కేసులు పెట్టి వదిలేయకుండా, వారి ఆస్తులను జప్తు చేయడం లేదా కఠినమైన జైలు శిక్షలు విధించడం ద్వారా మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఇలాంటి వ్యాపారస్తుల పట్ల ప్రభుత్వం ‘జీరో టోలరెన్స్’ విధానాన్ని అనుసరించాలి. పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ వల్ల వేలమంది ఆరోగ్యం కాపాడబడింది, కానీ ఇలాంటి తయారీ కేంద్రాలు గల్లీ గల్లీలో ఎన్ని ఉన్నాయో అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×