E-Paper
Advertisement

Mahindra XEV 9e: మహీంద్రా XEV 9e సినీలక్స్ బుకింగ్స్ ప్రారంభం, డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?

Mahindra XEV 9e: మహీంద్రా XEV 9e సినీలక్స్ బుకింగ్స్ ప్రారంభం, డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?
Advertisement

Mahindra XEV 9e Cineluxe Edition Booking: ఆటో దిగ్గజం మహీంద్రా ఎలక్ట్రిక్ SUV పోర్ట్‌ ఫోలియోను రోజు రోజుకు మరింత విస్తరిస్తుంది. ఇందులో భాగంగా కొత్త XEV 9e సినీలక్స్ ఎడిషన్‌ ను విడుదల చేసింది. చెస్ట్‌ నట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ స్మూత్ గ్రెయిన్ లెథరెట్‌ తో కూడిన ఇంటీరియర్ థీమ్‌ తో ఈ కారు మరింత అందగా తయారు చేయబడింది. దీని ధరను రూ. 29.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎడిషన్ కోసం బుకింగ్‌లు ఇవాళ ప్రారంభం అయ్యాయి. డెలివరీలు మార్చి 10 నుంచి షురూ అవుతాయి.

మహీంద్రా XEV 9e సినీలక్స్ గురించి..

ఈ కారు సినీలక్స్ ఎడిషన్ రెండు ప్రత్యేకమైన  షేడ్స్ లో కనిపిస్తుంది. శాటిన్ బ్లాక్, శాటిన్ వైట్ లో ఉంటుంది. ఈ షేడ్స్ చెస్ట్‌ నట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ స్మూత్ గ్రెయిన్ లెథరెట్‌ లో కొత్తగా తీసుకొచ్చిన ఇంటీరియర్ థీమ్‌లతో యాడ్ చేయబడ్డాయి. డాష్‌ బోర్డ్, సీట్లు, డోర్ ప్యానెల్స్ అంతటా టెక్స్చర్లు, ఫినిషింగ్‌ చాలా అందంగా ఉంటుంది. లోపల లాంజ్ లాంటి అనుభూతి ఉంటుంది.

మహీంద్రా XEV 9e సినీలక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Advertisement

ఈ SUV హైలైట్  కోస్ట్ టు కోస్ట్ ట్రిపుల్ HD డిస్ ప్లే సెటప్, ఇది డాష్‌ బోర్డ్ వెడల్పును విస్తరించి ఉంది. దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో  16 స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. 16 మిలియన్లకు పైగా కలర్ కలయికలను అందించే ఇన్ఫినిటీ రూఫ్, యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, ప్రయాణీకుల మూడ్‌, డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా క్యాబిన్ వాతావరణాన్ని మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది.

టాప్ స్పెసిఫికేషన్ ప్యాక్ త్రీ వేరియంట్‌పై నిర్మించబడిన సినీలక్స్ ఎడిషన్..  స్ట్రెయిట్‌ అహెడ్ విజన్ ఎక్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ అప్ డిస్‌ ప్లే, ఐడెంటిటీ డ్రైవర్, ఆక్యుపెంట్ మానిటరింగ్, ఆటో పార్క్ అసిస్ట్‌ తో హ్యాండ్స్‌ ఫ్రీ పార్క్, సెక్యూర్ 360 లాంటి ఫీచర్లను అందిస్తూనే ఉంది. ఇందులో క్యాంప్, కీప్, పావ్‌ పాల్ HVAC మోడ్స్, కస్టమ్ డ్రైవ్ మోడ్స్, డిజిటల్ కీ యాక్సెస్, సెక్యూర్ 360 ప్రో ఉంటుంది.

మహీంద్రా XEV 9e సినీలక్స్ బ్యాటరీ, రేంజ్

Advertisement

మహీంద్రా XEV 9e సినీలక్స్ కారు 79 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌ తో 500 కి.మీ కంటే ఎక్కువ రియల్ వరల్డ్ ప్రయాణాన్ని అందిస్తుంది. పవర్ అవుట్‌ పుట్ 210 kW  ఉంటుంది. గరిష్ట టార్క్ 380 Nm ఉంటుంది.  ప్రస్తుతానికి, రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ మాత్రమే ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ అందుబాటులో లేదు.

Read Also: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×