Mahindra Expands EV Lineup: దేశీ ఆటో మోబైల్ దిగ్జం మహీంద్రా & మహీంద్రా SUVల తయారీలో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాలతో మార్కెట్ లో సత్తా చాటగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా దృష్టి పెట్టింది. రాబోయే నెలల్లో కొత్త టెక్నాలజీతో కూడిన పలు ఎలక్ట్రిక్ SUVలను మార్కెట్‌లోకి తీసుకురావాలని మహీంద్రా భావిస్తోంది. అందులో భాగంగా పలు క్రేజీ ఎలక్ట్రిక్ SUVలను తీసుకురాబోతోంది. ఇంతకీ ఆ మోడల్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మహీంద్రా BE6కు సంబంధించిన కొత్త అప్‌డేట్ తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఇది 59 kWh, 79 kWh బ్యాటరీలతో అందుబాటులో ఉంది. త్వరలోనే 70 kWh బ్యాటరీ వేరియంట్ కూడా రానుంది. ఈ బ్యాటరీతో సుమారు 600 వరకు రేంజ్ అందుబాటులో ఉంటుందని అంచనా. అలాగే 242 bhp పవర్, 380 Nm టార్క్ ఇస్తుంది. ఈ మోడల్ ఇతర వేరియంట్ల మధ్య మంచి బ్యాలెన్స్ గా ఉంటుంది.
ఆ తర్వా మహీంద్రా XEV 9Eలో కూడా 70 kWh బ్యాటరీ ఆప్షన్ రానుంది. రేంజ్, పవర్ పరంగా ఇది BE6లాగే ఉంటుంది. అయితే ఫీచర్లు, కన్ఫర్ట్ విషయంలో కొంత అప్ డేట్ గా ఉంటుంది.
ఇక మహీంద్రా BE 07 ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్ లోకి రానుంది. పరిమాణం పరంగా ఇది కొంచెం పెద్దగా ఉండి, లోపల ఎక్కువ స్థలం ఇస్తుంది. హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ వంటి కార్లకు పోటీగా నిలవనుంది. ఇందులో కూడా 59, 70, 79 kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది.
మరో ఆసక్తికరమైన మోడల్ మహీంద్రా విజన్ ఎస్. ఇది కొత్త NU-IQ ప్లాట్ ఫారమ్ పై రూపొందించబడుతోంది. ఈ ప్లాట్ ఫామ్ ప్రత్యేకత, ఒకే వాహనంలో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్.. అన్ని రకాల పవర్ ట్రెయిన్ లను సపోర్ట్ చేస్తుంది. ముందుగా దీని పెట్రోల్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత EV వెర్షన్ కూడా రానుంది.
చివరిగా మహీంద్రా థార్.e కూడా అందుబాటులోకి రానుంది. ఇది 5-డోర్ ఎలక్ట్రిక్ ఆఫ్ రోడర్‌గా రానుంది. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ కోసం రూపొందించిన ఇంగ్లో ప్లాట్ ఫారమ్‌పై ఈ కారు నిర్మించబడింది. దీని ఫీచర్లు, బ్యాటరీ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. మార్కెట్ లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. మొత్తంగా మహీంద్రా ఎలక్ట్రిక్ SUVలు కొత్త మోడ్‌లు, మెరుగైన రేంజ్, ఆధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో భారత మార్కెట్ లో ఈ కంపెనీకి మరింత బలమైన స్థానాన్ని పొందే అవకాశం ఉంది.
Read Also: రూ.5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కు టాప్ ఛాయిస్!