E-Paper
Advertisement

రూ.5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌ కు టాప్ ఛాయిస్!

రూ.5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌ కు టాప్ ఛాయిస్!
Advertisement

Best Mileage Cars Under Rs.5 Lakh: మన దేశంలో చాలా మంది తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, అదీ తొలిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు రూ. 5 లక్షల లోపు కారు కొనాలనుకుంటారు. ఈ ధర పరిధిలో కూడా చక్కటి  మైలేజ్, గుడ్ లుకింగ్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, టాటా మోటార్స్ లాంటి కంపెనీలు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కార్లను అందిస్తున్నాయి. ఇంతకీ అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

ఈ సెగ్మెంట్‌ లో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునే కార్లలో ఒకటి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. చిన్న సైజ్ లో ఉండే ఈ కారు SUV లుక్‌ తో కనిపించడం దీని ప్రత్యేకత. సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుందిజ మైలేజ్ కూడా బాగుంటుంది. CNG వేరియంట్ కూడా ఉండటం వల్ల ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10

Advertisement

ఈ కారు చాలా సంవత్సరాలుగా భారతీయ కుటుంబాలను ఆకట్టుకుంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, సింపుల్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ప్లస్ పాయింట్లు. 1.0 లీటర్ ఇంజన్‌ తో వస్తుంది. మొదటిసారి కారు కొనేవారికి ఇది సేఫ్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ రెనాల్ట్ క్విడ్  

కొంచెం స్టైలిష్‌ గా కనిపించే కారు కావాలనుకునేవారికి రెనాల్ట్ క్విడ్ మంచి ఎంపిక. SUV స్టైల్ డిజైన్‌ తో పాటు ఆధునిక ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఇతర కార్లతో పోలిస్తే కొంచెం పవర్‌ ఫుల్ ఇంజన్ ఉండటం, అలాగే ఆటోమేటిక్ ఆప్షన్ ఉండటం వల్ల సిటీలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ టాటా టియాగో

Advertisement

బలమైన బిల్డ్ క్వాలిటీ, భద్రతా ఫీచర్లు కావాలనుకునే వారికి టాటా టియాగో మంచి ఆప్షన్. ఈ ధర పరిధిలో మంచి సేఫ్టీ కలిగిన కార్లలో బెస్ట్ ఆప్షన్. మంచి డ్రైవింగ్‌ ఎక్స్ పీరియెన్స్, కంఫర్ట్  గా ఉంటుంది. కొంచెం ప్రీమియం ఫీలింగ్ కోరుకునేవారికి  చక్కగా సరిపోతుంది.

Read Also: ప్రభుత్వ సబ్సిడీ + బ్యాంక్ లోన్, ఈవీ స్కూటర్ కొనడం చాలా ఈజీ!

⦿ మారుతి సుజుకి సెలెరియో

ఇంధన పొదుపు కావాలనుకునే వారికి మారుతి సుజుకి సెలెరియో బెస్ట్ ఆప్షన్. ఈ కారు మంచి మైలేజ్ ఇస్తుంది. మాన్యువల్‌ తో పాటు ఆటోమేటిక్ వేరియంట్ కూడా లభిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు  ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు దీని అదనపు క్వాలిఫికేషన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: హాట్ వెదర్‌కు కూల్ SUVలు, రూ. 12 లక్షల్లోపు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్ మోడల్స్ ఇవే!

Related News

కొనుగోలుదారులకు టీవీఎస్ షాక్.. ఐక్యూబ్ సహా పలు స్కూటర్ల ధరలు భారీగా పెంపు!

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!

కొత్త స్కార్పియో-N వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై సూపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల తగ్గింపు!

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

Big Stories

Advertisement
×