E-Paper
Advertisement

Splendor to Royal Enfield: క్షణాల్లో స్ప్లెండర్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ గా మార్చేశాడు, వీడు మామూలోడు కాదు భయ్యా!

Splendor to Royal Enfield: క్షణాల్లో స్ప్లెండర్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ గా మార్చేశాడు, వీడు మామూలోడు కాదు భయ్యా!
Advertisement

Viral Video: అదేదో సినిమాలో చెప్పినట్లు టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే అద్భుతాలు చెయ్యొచ్చు. అచ్చంగా ఇలాంటి ప్రయత్నమే చేశాడు ఓ బైక్ మెకానిక్. ఇతడు ఎంత టాలెంట్ అంటే సాధారణ బైకులను కూడా అసాధారణ బైకులుగా మార్చగల సత్తా ఉన్నోడు. రీసెంట్ గా @MyWishIsUs అనే ఎక్స్ వినియోగదారుడు ఓ వీడియోను షేర్ చేశాడు. సుమారు అర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో సదరు మెకానిక్ హీరో స్ప్లెండర్ ను ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ గా మార్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్ప్లెండర్ టు రాయల్ ఎన్ఫీల్డ్!

ఈ పోస్టుకు  “99 missed calls from Royal Enfield CEO” అంటూ ఎక్స్ యూజర్ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఒక మోటార్‌ సైకిల్‌ను మార్చి, కస్టమైజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ సాధారణ హీరో స్ప్లెండర్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ లాగా మార్చుతాడు.  ముందుగా స్ప్లెండర్ ను గ్యారేజీకి తీసుకొచ్చి, దాని హెడ్ లైట్, హ్యాండిల్ సహా పలు పలు పార్ట్ లను తొలగిస్తారు. దానికి రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ లైట్, హ్యాండిల్ ఏర్పాటు చేస్తాడు. బైక్ ట్యాంక్  మీద రాయల్ ఎన్ఫీల్డ్ లాగా లుక్ ఇచ్చేలా కవర్ ను అతికిస్తాడు. ఆ తర్వాత దాని మీద MAG 1501 అని రాసి ఉండే స్టిక్కర్ అంటిస్తాడు. పెద్ద హెడ్‌ లైట్, హార్న్,  ఇతర మోడిఫికేషన్లు చేస్తాడు. కాసేపట్లోనే ఆ బైక్ ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెడీ అవుతోంది.

నెట్టింట వీడియో వైరల్

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, ఈ బైక్ నెంబర్ ప్లేట్ DL 15 TB 6624 అని ఉండటం వల్ల ఈ మోడిఫికేషన్ ఢిల్లీలో జరిగినట్లు అర్థం అవుతోంది. స్ప్లెండర్ ను అద్భుతమైన హై మైలేజ్  రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టైల్‌లో మార్చడం వల్ల, రాయల్ ఎన్‌ఫీల్డ్ CEO కాల్ చేస్తున్నాడంటూ ఫన్నీ వేలో ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు స్టైలిష్ గా ఉంటాయి. కానీ, మైలేజ్ తక్కువ ఇస్తాయి. అయితే, ఈ మోడీఫై రాయల్ ఎన్ఫీల్డ్ అద్భుతమైన మైలేజ్ ఇస్తుందంటూ ఫన్ చేశాడు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

Advertisement

ఇక ఈ వీడియోపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే లక్షల కొద్ది వ్యూస్ సాధించింది. “బెస్ట్ మైలేజ్ ఇచ్చే అద్భుతమైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇది” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో కాల్ చేసినా తను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, తనే పర్సనల్ గా వచ్చి కలవాలని భావిస్తున్నాడు” అని నెటిజన్ కామెంట్ పెట్టాడు. “గుడ్ మైలేజ్ రాయల్ ఎన్ఫీల్డ్” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇతడి కోసం ఇస్రో కూడా వెతుకుతోంది” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లకు ఫుల్ ఫన్ పంచుతోంది.

Read Also: టాటా నుంచి కళ్లు చెదిరి కారు.. అవిన్యా ఈవీని చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×