E-Paper
Advertisement

Tata Avinya EV Car: టాటా నుంచి కళ్లు చెదిరి కారు.. అవిన్యా ఈవీని చూస్తే వావ్ అనాల్సిందే!

Tata Avinya EV Car: టాటా నుంచి కళ్లు చెదిరి కారు.. అవిన్యా ఈవీని చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Tata Avinya EV Car 2026: టాటా మోటార్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. చూడ్డానికి అద్భుతమైన లుక్, మంచి రేంజ్ తో కాన్సెప్ట్ మోడల్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే టాటా అవిన్యా EV విడుదల కాబోతోంది. ప్యూచర్   ప్రీమియం EV మార్కెట్‌ లో టాటా నుంచి ముఖ్యమైన ఎంట్రీ కాబోతోంది. ఇది Gen-3 EV ప్లాట్‌ఫాం  మీద బిల్ట్ చేయబడుతుంది.

అవిన్యా EVలాంచ్ డేట్

అవిన్యా EV బ్రాండ్ కింద మొదటి మోడల్ (స్పోర్ట్‌ బ్యాక్) 2026 చివరి నాటికి లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఆటో నిపుణులు. అవిన్యా X SUV మోడల్ 2027 జూన్‌ లో లాంచ్ అవుతుంది. ఈ కారు కాన్సెప్ట్ 2022లో రివీల్ అయింది.  అవిన్యా X 2025 ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించబడింది.

అవిన్యా EV ధర

Advertisement

అవిన్యా EV అంచనా ధర రూ. 30 – రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. స్పెసిఫిక్‌ గా రూ. 35- రూ.40 లక్షలు లేదంటే రూ. 45 లక్షల వరకు ఉండవచ్చు.  మోడల్, వేరియంట్ ప్రకారం పెరుగుతుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఉంటుంది. టాటా హారియర్ EV కంటే ఎక్కువ ధర ఉంటుంది.

అవిన్యా EVరేంజ్ / మైలేజ్

అవిన్యా EV అంచనా రేంజ్.. ఒక్క ఛార్జ్ మీద 500 km ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీతో హై రేంజ్ పెర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది.

స్పెసిఫికేషన్స్, ఫీచర్లు

Advertisement

అవిన్యా EV రెండు మోడల్స్ (స్పోర్ట్‌ బ్యాక్, X SUV) సమానమైన ఫీచర్లు కలిగి ఉండవచ్చు.

⦿ బాడీ స్టైల్:  SUV / స్పోర్ట్‌ బ్యాక్ (కూపే-లైక్ సిల్హౌట్)

⦿సీటింగ్: 5 సీట్లు

⦿ ట్రాన్స్‌ మిషన్: ఆటోమేటిక్

⦿ పవర్‌ట్రెయిన్: ఎలక్ట్రిక్ (రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు)

⦿బ్యాటరీ: అడ్వాన్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీ (కెపాసిటీ TBA)

⦿రేంజ్: 500 km/ ఫుల్ చార్జ్

⦿ పెర్ఫార్మెన్స్: హై రేంజ్, ఫాస్ట్ చార్జింగ్

ఇతర ఫీచర్లు

ADAS సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్, మల్టిపుల్ స్క్రీన్ సెటప్, సీట్ వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, LED హెడ్‌ లైట్స్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్‌రెస్ట్ స్పీకర్లు, AI, మెషిన్ లెర్నింగ్, వాయిస్ ఆక్టివేటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది.

డిజైన్

ఫ్యూచరిస్టిక్, మినిమలిస్టిక్. పనోరమిక్ గ్లాస్ రూఫ్, 22 ఇంచ్ అల్లాయ్స్, సస్టైనబుల్ మెటీరియల్స్, ఫుల్ విడ్త్ LED లైట్ బార్, స్ట్రాంగ్ షోల్డర్ లైన్, గ్లాస్ రూఫ్, బ్లాక్డ్ అవుట్ A పిల్లర్స్ ఉంటాయి.

ఇంటీరియర్: మినిమలిస్ట్, ప్రీమియం, కంఫర్ట్ ఫోకస్డ్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఫ్లాట్ ఫ్లోర్ లేఅవుట్, లాంజ్ లైక్ క్యాబిన్, స్వివెలింగ్ ఫ్రంట్ సీట్లు, స్పేసియస్ గా ఉంటుంది.

సేఫ్టీ

6 ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉంటుంది. లాంచ్ సమయంలో కచ్చితమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also:  ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×