E-Paper
Advertisement

New Car Launches March 2026: టయోటా To స్కోడా.. మార్చి 2026లో లాంచ్ కానున్న 6 కొత్త కార్లు!

New Car Launches March 2026: టయోటా To స్కోడా.. మార్చి 2026లో లాంచ్ కానున్న 6 కొత్త కార్లు!
Advertisement

6 New Cars Confirmed to Launch in March 2026: మార్చి 2026లో ఆడి, మెర్సిడెస్ బెంజ్, నిస్సాన్, రెనాల్ట్, స్కోడా, టయోటా లాంటి ఆటోమేకర్లు దేశీయ మార్కెట్లోకి సరికొత్త కార్లను లాంచ్ చేయబోతున్నాయి. వీటిలో ఎక్కువగా SUVలు ఉన్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మెర్సిడెస్-బెంజ్ V క్లాస్

దేశంలో లగ్జరీ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ V క్లాస్‌ను తిరిగి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. గత మోడల్ తో పోల్చితే అప్ డేట్ చేసిన వెర్షన్‌ తో 2022లో సరఫరా నిలిపివేసిన మోడల్ ను సరికొత్తగా తీసుకొస్తుంది. అంతర్జాతీయంగా, లగ్జరీ MPV మల్టిఫుల్ సీటింగ్ ఫార్మాట్లలో అందించనుంది. ఇందులో ఎనిమిది, ఏడు సీట్ల లే అవుట్లు,  రెండవ, మూడవ వరుసలలో కెప్టెన్ కుర్చీలను కలిగి ఉంటారు. మరింత ప్రీమియం ఆరు సీట్ల కాన్ఫిగరేషన్ ఉన్నాయి.

⦿ కొత్త రెనాల్ట్ డస్టర్

Advertisement

గత నెలలో కొత్త రెనాల్ట్ డస్టర్ ను ఆవిష్కరించబడింది. మార్చి 17న దీని అధికారిక ధరలు ప్రకటించబడతాయి. ఇది షార్ప్ డిజైన్ డిజైన్ ను కలిగి ఉంటుంది. పవర్‌ ట్రెయిన్ ఎంపికలలో 1.0L టర్బో పెట్రోల్, 1.3L టర్బో పెట్రోల్, 1.8L హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి.

⦿ ఆడి SQ8

SQ8 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుంది. 507 hp పవర్, 770 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణ Q8 3.0-లీటర్ టర్బో పెట్రోల్ V6 మిల్ కంటే హై రేంజ్ లో ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ తో పాటు  ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో జతచేయబడిన ఉంటుంది. 4.1 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోనుంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా

Advertisement

e విటారా మాదిరిగా హార్టెక్ట్ ఇ ప్లాట్‌ ఫారమ్ మీద రూపొందింది.  49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 500 కి.మీకి పైగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. e విటారాతో పోలిస్తే, చిన్న చిన్న మార్పులను కలిగి ఉంటుంది. అయితే, యాక్సెసరీస్ లిస్టులో పూర్తి డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ కన్సోల్, పెద్ద టచ్‌ స్క్రీన్ యూనిట్, లెవల్ 2 ADAS సహా పలు ఫీచర్లను కలిగి ఉంది.

⦿ స్కోడా కుషాక్ ఫేస్‌ లిఫ్ట్

ఫేస్‌ లిఫ్టెడ్ కుషాక్ కొన్ని వారాల క్రితం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ మోడల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ కారు  కాస్మెటిక్ అప్ డేట్స్, అంతర్గత మెరుగుదలలతో వస్తుంది. అయితే సెగ్మెంట్ ఫస్ట్ రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్‌ తో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, యాంప్లిఫైయర్, సబ్‌ వూఫర్‌ తో మెరుగైన ఆడియో సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. కొత్త ఎనిమిది స్పీడ్ AT కూడా లైనప్‌ లో చేరింది.

⦿ నిస్సాన్ టెక్టన్

నిస్సాన్ కాంపాక్ట్ MPV గ్రావైట్‌ను తీసుకువచ్చింది. ట్రైబర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందింది. 1.0L NA మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంది. దీని కస్టమర్ డెలివరీలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. కొత్త డస్టర్ ఆధారిత నిస్సాన్ టెక్టన్ కూడా వచ్చే నెలలో ఎప్పుడైనా అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

Read Also: 2026-27లో ఏకంగా 8 కొత్త మోడల్స్, రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×