E-Paper
Advertisement

Royal Enfield 2026-27 Lineup: 2026-27లో ఏకంగా 8 కొత్త మోడల్స్, రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Royal Enfield 2026-27 Lineup: 2026-27లో ఏకంగా 8 కొత్త మోడల్స్, రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Upcoming Royal Enfield Bikes & EVs: రాయల్ ఎన్‌ఫీల్డ్ 2026-27లో 350 cc, 450 cc, 650 cc పోర్ట్‌ ఫోలియోలను మరింత విస్తరించబోతోంది. అదే సమయంలో దేశీ మార్కెట్ లో కొత్త 750 cc, యు ఎలక్ట్రిక్ మోడల్స్ ను తీసుకువస్తుంది. ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ రెండు లాంచ్‌లతో మార్కెట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతుండటంతో, రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే లాంచ్‌లలో ఎలక్ట్రిక్ మోడల్స్ కీ రోల్ పోషించనున్నాయి. C6, S6 లాంటి మోడల్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులోకి రానున్నాయి. స్క్రాంబ్లర్ లాంటి క్యూస్, లాంగర్ టావెల్ సస్పెన్షన్, డ్యూయల్ పర్పస్ వీల్స్‌ తో రూపొందించబడింది. ఈ బైక్ వచ్చే ఏడాది లాంచ్ కానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్స్

C6, S6 EVలు సాధారణ బ్యాటరీలను ఉపయోగిస్తాయి. వాటి తర్వాత ఎలక్ట్రిక్ హిమాలయన్ ఉంటుంది.  సరికొత్త EVలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నప్పటికీ, అదే సమయంలో, ICE పోర్ట్‌ ఫోలియోను కూడా మరింత విస్తరించబోతోంది. కొత్తగా  బుల్లెట్ 650ని తీసుకొస్తుంది. ఇది బ్రాండ్ సాంప్రదాయ డిజైన్ తో 648 cc సమాంతర ట్విన్ ఇంజిన్‌ తో వస్తుంది. ఈ మోటార్ సైకిల్ 47 bhp, 52 Nm కంటే ఎక్కువ టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ ట్విన్ సిలిండర్ మోటారు ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్,  అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో జత చేయబడింది. అదనంగా, కంపెనీ 125 సంవత్సరాల వారసత్వాన్ని గురతు చేసుకుంటూ  EICMAలో లిమిటెడ్ రన్ క్లాసిక్ 650 వార్షికోత్సవ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. రెడ్, గోల్డ్ టోన్లతో పాటు బ్లాక్ అవుట్ డిటెయిలింగ్‌ ను కలిపే ప్రత్యేకమైన కలర్ ఛేంజ్ స్కీమ్‌ రూపొందింది. ఈ బైక్ పరిమిత సంఖ్యలో మార్కెట్ లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

హిమాలయన్ 750 కూడా..

Advertisement

అటు రాయల్ ఎన్‌ఫీల్డ్ విస్తరణ వ్యూహంలో హిమాలయన్ 750 ఉండవచ్చు. మరింత సామర్థ్యం కలిగిన అడ్వెంచర్ మోటార్‌ సైకిల్ బ్రాండ్ టూరింగ్ క్రెడెన్షియల్స్ ను ఏకీకృతం చేయడానికి భారత్ తో పాటు విదేశాలలో ప్రస్తుత మిడిల్‌ వెయిట్ ఆఫర్ల కంటే హై రేంజ్ లో ఉంచేందుకు సహాయపడుతుంది. 450 cc, 650 cc ప్లాట్‌ ఫారమ్‌ల ఆధారంగా మరిన్ని కొత్త మోడళ్లు,  350 cc లైనప్‌ లోని రిఫ్రెష్డ్ వెర్షన్లు కూడా అభివృద్ధిలో ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GTకి సంబంధించి పెద్ద 750 cc ఇంజిన్ ను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న కాంటినెంటల్ GT 650 దశలవారీగా తొలగించబడదని కంపెనీ వెల్లడించింది. రాబోయే పెద్ద మోడల్‌ తో పాటు ఈ లైనప్‌ లో కొనసాగుతుందని తెలిపింది. ఈ సంవత్సరం చివర్లో పలు మెకానికల్ సవరణలతో వచ్చే 650 రిఫ్రెష్డ్ వెర్షన్ వైపు సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ అప్ డేట్స్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌ లతో రీ వర్క్ డ్ సస్పెన్షన్ అమరికతో పాటు డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ రోటర్ల జోడింపు, పొటెన్షియల్ బ్రేకింగ్ లాంటి అదనపు హంగులు రానున్నాయి.

Advertisement

Read Also: అదిరిపోయే డిజైన్, ఏకంగా 37 కిలో మీటర్ల మైలేజ్.. మార్కెట్ లోకి సరికొత్త మారుతి వ్యాగన్ R

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×