E-Paper
Advertisement

Holi 2026: ప్రేమ, సమానత్వం, సంతోషం..హోలీ రంగుల వెనక దాగి ఉన్న అసలు కథ!

Holi 2026: ప్రేమ, సమానత్వం, సంతోషం..హోలీ రంగుల వెనక దాగి ఉన్న అసలు కథ!
Advertisement

Holi 2026: హిందూ పండగలలో అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే పండగ ‘హోలీ’. కులమతాలకు అతీతంగా.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండగ స్నేహానికి, సమానత్వానికి ప్రతీక. ఈ ఏడాది మార్చి 4వ తేదీన జరుపుకోనున్న ఈ హోలీ, కేవలం రంగుల ఆట మాత్రమే కాదు. దీని వెనక గొప్ప పురాణ చరిత్ర, సామాజిక ప్రాముఖ్యత, వసంత కాలపు ఆహ్వానం దాగి ఉన్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు.

హోలీ చరిత్ర, విశిష్టత :
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండగను జరుపుకుంటారు. చలికాలం ముగిసి, వేసవి కాలం ప్రారంభమయ్యే వసంత కాలంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతున్నప్పుడు ఈ రంగుల పండగ వస్తుంది.

Advertisement

పురాణ చరిత్ర – ప్రహ్లాదుని కథ:
హోలీ జరుపుకోవడానికి ప్రధాన కారణం భక్త ప్రహ్లాదుని కథ. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం సహించలేక పోతాడు. ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత.. తన సోదరి ‘హోలిక’ సహాయం కోరుతాడు. హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే.. వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. కానీ.. విష్ణుమాయ వల్ల దైవ చింతనలో ఉన్న ప్రహ్లాదుడు సురక్షితంగా బయట పడతాడు. రాక్షస గుణం ఉన్న హోలిక మంటల్లో కాలిపోతుంది. ఈ విధంగా చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘హోలికా దహనం’ చేస్తారు. దీనినే మనం ‘కాముని పున్నమి’ అని కూడా అంటాం.

రాధా కృష్ణుల ప్రేమ:
బృదావనంలో శ్రీకృష్ణుడు తన గోపికలతో.. రాధతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆడుకునేవాడని పురాణాలు చెబుతాయి. అందుకే మధుర, బృందావనం వంటి ప్రాంతాల్లో హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రంగుల ఆట భగవంతుని పట్ల ఉండే ప్రేమానురాగాలకు చిహ్నం.

Advertisement

సామాజిక ప్రాముఖ్యత:
హోలీ పండగ సమాజంలో ఉన్న అంతరాలను తొలగిస్తుంది. అందరి ముఖాలకు రంగులు పూయడం వల్ల ఎవరు ధనికులు, ఎవరు పేదవారు అనే వ్యత్యాసం కనిపించదు. పాత కోపతాపాలను మర్చిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారే అద్భుతమైన సమయం ఇది. అందుకే దీనిని ‘ప్రేమ పండగ’ అని కూడా అంటారు.

Also Read: హోలీ 2026: మార్చి 3నా లేక 4నా? అసలు తేదీ, ముహూర్తం వివరాలు!

ఆరోగ్యపరమైన కోణం:
పూర్వకాలంలో హోలీ రంగులను మోదుగ పూలు, పసుపు, వేప వంటి ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసేవారు. వాతావరణం మారే సమయంలో వచ్చే చర్మ వ్యాధులు, జ్వరాల నుంచి రక్షణ పొందడానికి ఈ సహజ రంగులు యాంటీ బయోటిక్స్‌లా పనిచేసేవి. దురదృష్టవశాత్తు నేడు రసాయన రంగులు వాడుతున్నారు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

హోలీ 2026 వేడుకలు:
మార్చి 3వ తేదీ సాయంత్రం హోలికా దహనం, మార్చి4వ తేదీన రంగుల ఆట (ధూళి వందనం) జరుగుతాయి. ఈ రోజున రకరకాల పిండివంటలు, ముఖ్యంగా ‘గుజియా’ వంటి స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×