E-Paper
Advertisement

తెలంగాణ ‘ఐస్ ఆపిల్స్’: నోరూరించే తాటిముంజలతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తింటారు!

తెలంగాణ ‘ఐస్ ఆపిల్స్’: నోరూరించే తాటిముంజలతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తింటారు!
Advertisement

Ice Apple :ఎండాకాలం వచ్చిందంటే చాలు మనసు ఎప్పుడెప్పుడు చల్ల చల్లగా ఉండే పదార్థాల్ని తీసుకుందామా అని తెగ ఆరాట పడుతుంది. ఈ క్రమంలోనే కనబడ్డ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ని పొట్టలోకి తోసేస్తుంటాం కూడా. అయితే కెమికల్స్ నిండిన కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కంటే, ప్రకృతి మనకు ఇచ్చిన ‘తాటిముంజలు’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మీకు తెలుసా.

ముంజలకు సాటి మరేదీ లేదు 

Advertisement

ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన బాడీని ఇన్స్టంట్‌గా హైడ్రేట్ చేస్తాయి. ముంజల్లో కేవలం నీటి శాతమే కాదు, విటమిన్ ఎ, బి, సి లతో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి కడుపులో చల్లదనాన్ని ఇస్తాయి.ముఖ్యంగా తెలంగాణలో పెరిగే తాటి చెట్ల నుండి వచ్చే ఈ ముంజలకు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా విపరీతమైన డిమాండ్ ఉందండోయ్.వేసవిలో మనకు ఎదురయ్యే నీరసం, అలసటను తొలగించి బాడీకి అమృతం లాంటి శక్తిని ఇవ్వడంలో ముంజలకు సాటి మరేదీ లేదని చెప్పాలి.

చర్మ సౌందర్యం విషయంలోనూ మ్యాజిక్

Advertisement

ఇక కొంతమందికి ఎండకాలం వచ్చిందంటే చాలు జీర్ణం సరిగ్గా అవ్వక అజీర్తి, మలబద్దకంతో తెగ బాధపడుతుంటారు.అలాంటి వారు గనుక రోజూ రెండు తాటిముంజలు తిన్నారంటే పొట్టలో గ్యాస్ సమస్యలు తగ్గి, జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఇక చర్మ సౌందర్యం విషయంలోనూ ముంజలు మ్యాజిక్ చేస్తాయనే చెప్పాలి.

సూర్య కిరణాలతో వచ్చే ట్యాన్, చర్మంపై ఎర్రటి దద్దుర్లు లేదా మొటిమలు తగ్గాలంటే ముంజల మీద ఉండే లేత పొరను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది ఒక నేచురల్ సన్‌స్క్రీన్ లా పనిచేసి చర్మాన్ని మెరిపిస్తుంది.

also read:భార్య కావాల్సిందే.. లేదంటే దూకేస్తా! రేడియో టవర్ పై భర్త హైడ్రామా…వైరల్ వీడియో

వీటితో రకరకాల ఫ్యూజన్ వంటకాలు

ఇక ప్రస్తుత కాలంలో తాటిముంజలు కేవలం పండ్ల షాపులకే పరిమితం కాలేదండోయ్.. గ్యాస్ట్రోనమీ ట్రెండ్‌లో భాగంగా వీటితో రకరకాల ఫ్యూజన్ వంటకాలు తయారు చేస్తున్నారు. ముంజల జ్యూస్‌లో కాస్త నిమ్మరసం, పుదీనా కలిపి తయారుచేసే ‘తాటిముంజల మాక్టైల్’ ఇప్పుడు స్టార్ హోటల్స్‌లో  స్పెషల్ అట్రాక్షన్‌. మరికొందరు ముంజల గుజ్జుతో ఐస్‌క్రీమ్స్, కుల్ఫీలు తయారు చేస్తూ ఫుడ్ బ్లాగర్లను ఆకట్టుకుంటున్నారు కూడా.

ఇక పల్లెటూర్లలో అయితే లేత ముంజలను కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకునే పద్ధతి నేటికీ ఎంతో ఫేమస్.ఇక శాస్త్రీయంగా చూస్తే, ముంజల్లో ఉండే పొటాషియం రక్తపోటును కంట్రోల్  కాకుండా, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఇక గర్భిణీ స్త్రీలలో కలిగే మార్నింగ్ సిక్‌నెస్ మరియు వికారాన్ని తగ్గించడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

తాటిముంజలను మీ డైట్‌లో చేర్చుకోండి

ఇక పల్లెటూర్లలో ఆ తాటి కాయను అప్పటికప్పుడు వేట కొడవలితో కొట్టించి, బొటనవేలితో ఆ ముంజను తీసి గుటుక్కున మింగే ఆ మజాయే వేరు కదా. సో ఈ సీజన్‌లో దొరికే ముంజలని అస్సలు మిస్ కావద్దు. కేలరీలు చాలా తక్కువగా ఉండి, పోషకాలు కొండంత ఉండే తాటిముంజలను మీ డైట్‌లో చేర్చుకోండి. డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా, మన నేచురల్ ఫ్రూట్‌ను ఎంజాయ్ చేయండి.

ముదురు ముంజల కంటే లేతగా, నీటితో నిండి ఉండే ముంజలనే ఎంచుకోండి, ఎందుకంటే అవే రుచిలోనూ, ఆరోగ్యంలోనూ మేటి. మరి ఈ వేసవిలో ‘ఐస్ ఆపిల్స్’ గా పిల్చుకునే తాటి ముంజలని మనమూ  ఓ పట్టు పట్టేద్దమా!

also read:పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వొచ్చు అంటున్న నిత్యా మీనన్

Related News

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

Big Stories

Advertisement
×