E-Paper
Advertisement

బాలెనోను వెనక్కి నెట్టిన ఫ్రాంక్స్.. నెక్సా బెస్ట్ సెల్లింగ్ SUVగా రికార్డు!

బాలెనోను వెనక్కి నెట్టిన ఫ్రాంక్స్.. నెక్సా బెస్ట్ సెల్లింగ్ SUVగా రికార్డు!
Advertisement

Maruti Fronx Sales Cross 5 Lakh Units: మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్లో మరో కీలక మైలురాయిని దాటింది.  ఏప్రిల్ 2023లో విడుదలైన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ, మే 2026 నాటికి మొత్తం 5,12,829 యూనిట్ల అమ్మకాలను సాధించింది. దీంతో నెక్సా డీలర్‌ షిప్ నెట్‌ వర్క్ ద్వారా 5 లక్షల అమ్మకాల మార్కును దాటిన తొలి ఎస్‌యూవీగా ఫ్రాంక్స్ నిలిచింది.

ఏప్రిల్ 2023లో ఫ్రాంక్స్ విడుదల

ఫ్రాంక్స్ ప్రారంభమైనప్పటి నుంచి మారుతి యుటిలిటీ వెహికల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తోంది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటి వరకు కంపెనీ విక్రయించిన మొత్తం యుటిలిటీ వెహికల్స్ లో దాదాపు 22 శాతం వాటా ఫ్రాంక్స్‌ దే. ఫైనాన్షియల్ ఇయర్స్ వారీగా చూస్తే, FY2024లో ఫ్రాంక్స్ 1.34 లక్షల యూనిట్లు అమ్మింది. FY2025లో ఈ సంఖ్య 1.66 లక్షలకు పెరిగింది. FY2026లో మరింత మెరుగైన దూకుడుతో 1.72 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుత FY2027లో తొలి రెండు నెలల్లోనే 39,515 యూనిట్లు అమ్ముడవడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఇది 42 శాతం వృద్ధిని సాధించింది.

10 నెలల్లో లక్ష యూనిట్ల అమ్మకం

Advertisement

అమ్మకాల పరంగానూ ఫ్రాంక్స్ దూసుకెళ్లింది. మార్కెట్లోకి వచ్చిన 10 నెలల్లోనే 1 లక్ష అమ్మకాల మార్కును అందుకుంది. 17 నెలల్లో 2 లక్షలు, 33 నెలల్లో 4 లక్షలు పూర్తి చేసిన ఈ మోడల్, కేవలం 38 నెలల్లోనే 5 లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డును నమోదు చేసింది. ముఖ్యంగా చివరి 1 లక్ష యూనిట్లు కేవలం ఆరు నెలల్లోనే అమ్ముడవడం మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ ను సూచిస్తుంది.

FY2026లో ఫ్రాంక్స్ నెక్సా నెట్‌ వర్క్‌ లో రెండో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. బాలెనో కంటే కేవలం 197 యూనిట్లు మాత్రమే తక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే FY2027 తొలి రెండు నెలల్లో ఫ్రాంక్స్.. బాలెనో, గ్రాండ్ విటారా మోడళ్లను వెనక్కి నెట్టి నెక్సా బెస్ట్‌ సెల్లింగ్ మోడల్‌ గా అవతరించింది.

దేశీయంగానే కాదు.. ఎగుమతుల్లోనూ..

Advertisement

దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల్లో కూడా ఫ్రాంక్స్ సత్తా చాటుతోంది. ఇప్ప టివరకు 1.75 లక్షలకుపైగా యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. FY2026లో 90,186 యూనిట్ల ఎగుమతులతో భారతదేశంలో తయారైన అత్యధికంగా ఎగుమతి అయిన ప్యాసింజర్ వెహికల్ గా నిలిచింది.

లక్ష యూనిట్లు దాటిన విక్టోరిస్ అమ్మకాలు

అటు  మారుతి సుజుకి విక్టోరిస్ కూడా మార్కెట్లో వేగంగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 2025లో విడుదలైన ఈ ఎస్‌యూవీ కేవలం ఎనిమిది నెలల్లోనే 1 లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. జనవరి 2026లో అత్యధికంగా 15,240 యూనిట్లు అమ్ముడు కాగా, ప్రస్తుతం మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న యూవీలలో ఒకటిగా నిలిచింది.

Read Also: భారత్‌ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్‌ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!

Related News

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

రైళ్ల భద్రతకు డిజిటల్ టెక్నాలజీ.. మూడు కొత్త యాప్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వే!

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

అల్ట్రావయోలెట్ To వెస్పా.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లు.. ఫోర్స్ అర్బానియా డీలక్స్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×